AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. రేట్లలో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకో తగ్గుతూ వస్తోన్నాయి. సోమవారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతరం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. రేట్లలో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
Gold Rate
Venkatrao Lella
|

Updated on: Jun 22, 2026 | 6:51 AM

Share

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట. గోల్డ్ రేట్లు స్వల్పంగా పడిపోయాయి. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాక గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలగా.. ఈ వారం ప్రారంభంలో కూడా కుప్పకూలాయి. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలైన క్రమంలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఎగిరి గంతేస్తున్నారు. సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,070 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,890 దగ్గర ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,070గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,33,890గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,360 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,990గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,070గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,890 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,220 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,040 వద్ద ట్రేడవుతోంది

-ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,070 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,890గా ఉంది.

సిల్వర్ రేట్లు ఎలా..?

-ముంబైలో కేజీ సిల్వర్ ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,54,900గా ఉంది

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది.

Follow Us