AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గన్స్ చేతబట్టి అడవుల్లోకి స్టార్ హీరోయిన్లు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్!

గన్స్ చేతబట్టి అడవుల్లోకి స్టార్ హీరోయిన్లు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 7:47 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు నక్సలైట్ పాత్రల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ‘విరాట పర్వం’లో సాయి పల్లవి, ‘మా ఇంటి బంగారం’లో సమంత తర్వాత ఇప్పుడు రష్మిక మందన్న కూడా అలాంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గోండు గిరిజన యువతిగా కనిపించనున్న రష్మిక, ‘మైసా’ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు ఓ క్రేజీ క్యారెక్టర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ గతంలో అగ్ర హీరోల్లో చాలా మంది చేసిందే అది.. హీరోయిన్స్ కూడా ఒకప్పుడు ఆ తరహా పాత్రలు చేసారు. ఇన్నేళ్లకు మళ్లీ అలాంటి క్యారెక్టర్ వైపు స్టార్ హీరోయిన్స్ చూపులు పడుతున్నాయి. మొన్న సాయి పల్లవి.. నిన్న సమంత చేసిన పాత్రనే రేపు రష్మిక చేయబోతున్నారు. ఇంతకీ ఏంటా పాత్ర..? తెలుగు ఇండస్ట్రీకి నక్సలిజం బ్యాక్‌డ్రాప్ కొత్త కాదు.. స్టార్ హీరోల్లో చాలా మంది ఈ పాత్ర చేసారు. కొందరికి అది హిట్ ఇచ్చింది.. మరికొందరికి మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. అయినా కూడా కొందరు డైరెక్టర్స్ ఆ బ్యాక్‌డ్రాప్‌లోనే కథలు రాస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా నక్సలైట్ పాత్రలకు సై అంటున్నారు. ఆల్రెడీ మూడేళ్ల కిందే సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఫ్లాపైనా.. సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే తాజాగా విడుదలైన మా ఇంటి బంగారంలో సమంత సైతం ఇదే పాత్రలో నటించారు. యాక్షన్ సీన్స్ అన్నీ అదరగొట్టేసారు ఈ బ్యూటీ. తాజాగా రష్మిక మందన్న సైతం అడవిలో తిరుగుతూ తుపాకీ చేతబట్టే పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గోండు జాతి గిరిజన యువతిగా నటిస్తున్నారు రష్మిక. ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగిపోయే మైసా కోసం 60 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. మొత్తానికి మన హీరోయిన్స్ అంతా గన్స్ పట్టుకుని అడవులకు వెళ్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి

Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?

Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్‌

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్‌ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!

Follow Us