AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagabandham: ‘నాగబంధం’ సినిమా ట్రైలర్ విడుదల.. స్టార్ వాల్యూ లేకపోయినా భారీ బడ్జెట్

Nagabandham: ‘నాగబంధం’ సినిమా ట్రైలర్ విడుదల.. స్టార్ వాల్యూ లేకపోయినా భారీ బడ్జెట్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 7:42 PM

Share

టీజర్‌తో ఆసక్తి రేపిన ‘నాగబంధం’ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత హైప్ తెచ్చుకుంది. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని బ్రహ్మకమలం చుట్టూ సాగే ఈ ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్‌లో భారీ విజువల్స్, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా తెరకెక్కించారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో ఓ సినిమా గురించి చర్చ బాగా జరుగుతుంది. స్టార్ వ్యాల్యూ లేకపోయినా కోట్లకు కోట్లు పెడుతున్నారని.. విజువల్స్ గురించి విడుదలయ్యాక చాలా రోజులు మాట్లాడుకుంటారనేది దాని సారాంశం. ఆ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. మరి నిజంగానే విజువల్స్ అదే స్థాయిలో ఉన్నాయా..? అంతగా చర్చిస్తున్న ఆ సినిమా ఏంటి..? అందులో ఏముంది..? త్వరలో విడుదల కానున్న ‘నాగబంధం’ సినిమా ట్రైలర్ ఇది. టీజర్‌తోనే ఆసక్తి పుట్టించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పురాణాలు, రహస్యాల ఆధారంగా తెరకెక్కుతుంది. అనంత పద్మనాభ స్వామి గుడిలోని పవిత్రమైన ‘బ్రహ్మకమలం’ చుట్టూ ఈ కథ అల్లుకున్నారు దర్శకుడు అభిషేక్ నామా. ఆ బ్రహ్మకమలంలోని అద్భుతమైన దైవ శక్తిని దక్కించుకోవాలని దుష్ట శక్తులు ప్రయత్నిస్తుంటే.. దాన్ని కాపాడేందుకు పరమశివుడి భక్తులైన నాగసాధువులు రంగంలోకి దిగుతారు. అక్కడ్నుంచి ఏమైందనేది అసలు కథ. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసారని ట్రైలర్‌తోనే అర్థమవుతుంది. నాగబంధం కోసం ఇంటర్నేషనల్ VFX కంపెనీలు వర్క్ చేసాయి. సెట్ వర్క్స్ కూడా ట్రైలర్‌లో హైలైట్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ‘నాగబంధం’ కేవలం ఒక ఫాంటసీ మూవీగానే కాదు.. మిస్టరీయస్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా కనిపిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. స్టార్ వ్యాల్యూ లేకపోయినా.. కథపై నమ్మకంతో భారీగా తీస్తున్నారు అభిషేక్ నామా. జూలై 3న సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ నాగబంధం విజువల్ మాయ ఎలా ఉండబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి

Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?

Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్‌

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్‌ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!

Follow Us