ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.
Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..
అది వనపర్తిలోని రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతం.. అంతా తమ పనుల్లో తామున్నారు. ఇంతలో ఒక్కసారిగా కేకలు, అరుపులు.. పదుల సంఖ్యలో యువకులు వీధుల్లోకి చేరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చూస్తుంటే ఏదో గ్యాంగ్ వార్ జరుగుతోందా అన్నట్లుగా సీన్ మారిపోయింది. అసలు ఈ గొడవకు కారణం ఏంటో తెలసా..?
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 12, 2026
- 9:57 pm
Telangana: భార్యపై కోపం.. ఇద్దరు పిల్లల్ని చంపి కాలువలో పడేసిన తండ్రి! ఆ తర్వాత..
Father Kills Two Children, Attempts Suicide in Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి కసాయిగా మారి ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కోయిల్ సాగర్ డిస్టిబ్యూటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 6, 2026
- 6:46 pm
Gadwal: ఈయన ప్రమాదంలో చనిపోయారనుకుంటే హత్య అని తేలింది.. ఆపై నిందితుల విచారణలో మరో ట్విస్ట్
రోడ్డు ప్రమాదంగా అనుకున్న మరణం వెనుక పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ బయటపడటంతో జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంచలనం నెలకొంది. మాజీ సర్పంచ్ భీమా రాయుడిని హత్య చేసేందుకు ప్రత్యర్థి లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని కొత్త బోలేరో వాహనం కొనుగోలు చేసి ఢీ కొట్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను కస్టడీలో విచారించగా ఇదే తరహాలో మరొ రెండు హత్యలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 5, 2026
- 6:32 pm
Andhra: పుట్టింటికి వచ్చిన అక్కతో మాట్లాడదామని వెళ్లాడు.. ఎంతకూ తలుపు తీయలేదు.. కిటికీ ఓపెన్ చేయగా
భర్త లేని జీవితం ఊహించుకోలేకపోయింది ఓ భార్య. తాను, తన పిల్లలు ఎవరికి భారం కాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నది. పిల్లలపై ప్రేమను చంపుకోలేక.. భర్త మరణశోకం నుంచి బయటకి రాలేక విషాద ఘటనకు కారకురాలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కన్నీటిపర్యంతం చేస్తోంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Jan 2, 2026
- 12:36 pm
Telangana: కొడుకు చేసిన పనికి తండ్రి బలి.. వేటకోడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు..
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలయ్యాడు. వినడానికి ఏదోలా ఉన్నా... జరిగింది మాత్రం అత్యంత దారుణం. ఆ తండ్రిని వేటాడి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు నిందితులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును ఛేదిస్తే కుమారుడిపై పగను తండ్రిని చంపి తీర్చుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 25, 2025
- 8:39 pm
Telangana: జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 23, 2025
- 11:42 am
Telangana: సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎంబీబీఎస్ స్టూడెంట్
ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో యువ వికాసం విరిసింది. విద్యావంతులు గ్రామ సేవ కోసం క్యూ కట్టారు. తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి. సత్తా చాటారు. వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్‌గా ఎన్నికై సత్తా చాటింది. అటు చదువు.. ఇటు గ్రామాభివృద్ధి గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 19, 2025
- 2:04 pm
Telangana: గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యాడు.. కట్ చేస్తే..
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో వనపర్తి జిల్లాలో స్పష్టమైంది. ఆత్మకూర్ మండలంలో లారీ డ్రైవర్ మ్యాప్ చెప్పిన దారిలో వెళ్లి నేరుగా కృష్ణా నది ఘాట్ వరకు చేరాడు. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే లారీ నదిలోకి వెళ్లేదే. స్థానికుల సహకారంతో పెను ప్రమాదం తప్పింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 16, 2025
- 7:44 pm
1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఈ పల్లెపోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థలు సైతం సత్తాచాటారు. కొన్ని చోట్ల ప్రజల తీర్పు సరిసమానంగా వచ్చిన పరిస్థితి ఉంటే.. మరికొన్ని చోట్ల కేవలం సింగిల్ డిజిట్ తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అభ్యర్థులు.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 15, 2025
- 4:24 pm
Telangana: ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్.. అదే నా ధ్యేయమంటూ..
పట్టణాల వైపు పరుగులు తీసే యువతరం.. తమ పుట్టిన గ్రామాలను, అక్కడి రాజకీయాలను పట్టించుకోరనే వాదనలను ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలు కొట్టిపారేస్తున్నాయి. చదువు, ఉద్యోగాల పేరుతో మెజారిటీ యువత గ్రామాలకు దూరమైనా.. కొందరు మాత్రం తమ సామాజిక బాధ్యతను గుర్తించి గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. ఎంబీబీఎస్ చదవుతున్న యువతి గ్రామాభివృద్ధే లక్ష్యమంటూ సర్పంచ్ బరిలో నిలిచింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 5, 2025
- 3:36 pm
Telangana: అమెరికా నుంచి వచ్చి నామినేషన్.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం సొంతూరుకు మహిళ..
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ మహిళ ఆమెరికా నుంచి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా లట్టుపల్లిలో సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో ఆమె హుటాహుటిన ఆమెరికా నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేసింది. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెబుతుంది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 2, 2025
- 9:40 pm
Telangana: పోస్ట్ ఉంది ఓకే.. మరి అభ్యర్థి ఏరి? ఆ గ్రామంలో పంచాయతి ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్!
పల్లె పోరులో ఎన్నెన్నో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ కోసం పోరాటం ఒక వైపు అయితే కొన్ని పంచాయతీల్లో రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. అసలు ఆ సామాజికవర్గానికి చెందిన ఒక్క ఓటరు లేక పోయిన వారికే వార్డులు, సర్పంచ్ స్థానాలు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎన్నికలు పరిపాలన ప్రశ్నార్ధకంగా మారింది.
- Boorugu Shiva Kumar
- Updated on: Dec 2, 2025
- 9:33 am