AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి..? ఇంటి వద్ద నుంచే ఇలా సింపుల్‌గా..

పాన్ కార్డు అనేది దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఎలాంటి పెద్ద ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలన్నా పాన్ కార్డు అనేది అవసరమే. రూ.50 వేలకు మంచి నగదు డిపాజిట్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ అవసరం. అయితే మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలంటే..

Pan Card: పాన్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి..? ఇంటి వద్ద నుంచే ఇలా సింపుల్‌గా..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Mar 19, 2026 | 1:45 PM

Share

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహణకు పాన్ కార్డు అనేది అవసరం. ప్యాన్ కార్డ్ లేనిది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. దీని వల్ల వల్ల మీరు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. ఇక మీకు వచ్చే నెలవారీ జీతం కూడా పొందలేరు. ఇలా ప్రతీ ఆర్ధిక వ్యవహారానికి పాన్ కార్డు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా పాన్ కార్డు అనేది సహాయపడుతుంది. ఇంత ముఖ్యమైన ఈ డాక్యుమెంట్‌లో మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలో చూద్దాం,

నెంబర్ మార్చాలంటే..?

-ఎన్‌ఎస్‌డీఎల్ లేదా UTIITSL వెబ్‌సైట్ సందర్శించండి

-హోమ్ పేజీలో సర్వీసెస్‌లో పాన్ ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత పాన్ డేటాలో మార్పు లేదా సవరణలు అనే ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత అప్లికేషన్ రకంలో ఇప్పటికే ఉన్న పాన్ డేటాలో మార్పు లేదా పాన్ కాకర్డ్ రీప్రింట్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఎంటర్ చేయండి

-ఈ తర్వాత మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత టోక్ ఐడీని క్రియేట్ అవుతుంది.. దానిని సేవ్ చేసుకోండి

-దాని కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేసి కొనసాగించండి

-ఎన్‌ఎస్‌డీఎల్ ఈ గవర్న్, ఈ సైన్ ద్వారా స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి

-ఆ తర్వాత అప్ డేట్ కోసం కొంత ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించండి

-ఆ తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోండి

-మీ పాన్ కార్డు అప్డేట్ స్టేటస్‌ను రిఫరెన్స్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి

ఎన్ని రోజుల సమయం పడుతుంది..?

మీరు పాన్ కార్డు వివరాలను సమర్పించి అప్డేట్ చేసిన తర్వాత వెంటనే వివరాలు అప్డేట్ కావు. ఇందుకు కొంత సమయం పడుతుంది. సుమారు 15 నుంచి 20 రోజుల వరకు సమయం పడుతుంది.

Follow Us