ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
'ముంబైలో ఓ ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో నెట్టింట చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్ చేసిన ఓ టెకీ తన ఇంట్లో రిపేర్ చేయడానికి వచ్చిన ప్లంబర్‌తో మాటామంతీ కలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకున్నామని.అతడి సంపాదన గురించి ఆరా తీయగా షాక్ అయినట్లు తెలిపాడు. సాధారణంగా వైట్ కాలర్ ఉద్యోగుల స్థాయి ఆదాయాన్ని ఒక ప్లంబర్ సంపాదిస్తుండటం ఆశ్చర్యపరిచింది. ప్లంబర్ కి ‘‘హుందాయ్ క్రెటా’’ వంటి లగ్జరీ కారు ఉండటం విశేషం. ముంబై లాంటి ఖరీదైన నగరంలో ఒక ప్లంబర్ ఇంతటి ఆర్థిక స్థాయిని కలిగి ఉండటం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పెద్ద చర్చకు దారితీసింది.
అందులో వెల్లడించిన వివరాలు.. ఇటీవల తన ఇంట్లో ఓ పైపు మరమ్మతు కోసం హౌసింగ్ సొసైటీ ప్లంబర్ ను పిలిచానని టెక్కీ చెప్పాడు. పైపు మరమ్మతు చేస్తూ ఆ ప్లంబర్ తన జీవితం, సంపాదన, తాను కూడబెట్టిన ఆస్తుల గురించి చెప్పుకొచ్చాడని వివరించారు. తమ హౌసింగ్ సొసైటీతో పాటు బోరివలీ, కాండీవలీలోని మొత్తం మూడు సొసైటీలలో పనిచేస్తూ ఏటా 18 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు. తొలుత ఆయన జోక్ చేస్తున్నాడని భావించినా.. సొంతూళ్లో ఇల్లు కట్టుకున్నానని, కొంత వ్యవసాయ భూమి కూడా కొనుగోలు చేశానని చెప్పడంతో నమ్మానని వివరించాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “మేము తప్పుడు కెరీర్ ఎంచుకున్నామా?” అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ‘‘నైపుణ్యం ఉన్న పనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని’’ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ముంబై లాంటి నగరాల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులకు ఉండే విపరీతమైన డిమాండ్ కారణంగా అది సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ పనైనా అంకితభావంతో నైపుణ్యంతో చేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చదువుతో పాటు ‘వృత్తి నైపుణ్యం’ కూడా అంతే ముఖ్యమని ఈ కథనం నిరూపిస్తోంది. చాలా మంది ఐటీ ఉద్యోగుల కంటే ఈ ప్లంబర్ మెరుగ్గా సంపాదిస్తున్నాడని నెటిజన్లు తమ ‘లైఫ్ ఛాయిస్’ గురించి పునరాలోచనలో పడ్డారు.
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

