AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. వాటర్ బాటిల్ కావాలని వచ్చాడు.. చివరకు..

జడ్చర్ల స్థానిక కృష్ణారెడ్డి నగర్ లో మంజుల అనే మహిళ లక్ష్మీనరసింహ కిరాణ జనరల్ స్టోర్ తో పాటు లేడీస్ టైలరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం గం.1.00లకు ముగ్గురు యువకులు బైక్ పై కాలనీలోని లక్ష్మీనరసింహ కిరాణం వద్దకు వచ్చారు.

షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. వాటర్ బాటిల్ కావాలని వచ్చాడు.. చివరకు..
Jadcherla Chain Snatching
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 1:07 PM

Share

వాటర్ బాటిల్ కావలంటూ కిరాణా షాప్ కు వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించారు గుర్తుతెలియని దుండగులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. జడ్చర్ల స్థానిక కృష్ణారెడ్డి నగర్ లో మంజుల అనే మహిళ లక్ష్మీనరసింహ కిరాణ జనరల్ స్టోర్ తో పాటు లేడీస్ టైలరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం గం.1.00లకు ముగ్గురు యువకులు బైక్ పై కాలనీలోని లక్ష్మీనరసింహ కిరాణం వద్దకు వచ్చారు. షాపు ముందు బైక్ ను నిలిపి చివరగా కూర్చొన్న వ్యక్తి బైక్ దిగి షాప్ వద్దకు వచ్చాడు. లీటర్ వాటర్ బాటిల్ కావాలని అడిగాడు. ఆమె వాటర్ బాటిల్ తీసుకువచ్చి.. కౌంటర్ వద్ద నుంచి యువకుడికి ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది.

ఇంతలోనే.. అతను.. ఆమె మెడలోంచి రెండు తులాల పుస్తెల తాడు లాక్కొని పరిగెత్తాడు. అప్పటికే బైక్ ను స్టార్ట్ చేసి ఉంచిన ఇద్దరు మిత్రులతో కలిసి బైక్ పై పరారయ్యారు. క్షణల్లోనే జరిగిన దోపిడితో ఒక్కసారిగా మంజుల షాక్ కు గురై కేకలు వేస్తూ కిరాణ షాపు నుంచి బయటకు వచ్చింది. అప్పటికే దుండగులు బైక్ పై వేగంగా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడకు చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కిరాణ షాపు వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. కాలనీలో ఉన్న మిగతా సీసీ ఫుటేజ్ సేకరించి నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీడియో చూడండి..

లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్:

అయితే లక్ష్మీనరసింహ కిరాణంలో చైన్ స్నాచింగ్ పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కాలనీ రహదారులు నిర్మానుష్యంగా ఉండడంతో పాటు.. కిరాణ షాపు వద్ద ఎవరూ లేకపోవడంతో దుండగులకు కలసి వచ్చింది. ఎవరూ అడ్డుకునే అవకాశం లేకపోవడంతో నిందితులు వేగంగా ఘటనాస్థలి నుంచి పరారయ్యారు.

ఒక్కసారిగా జడ్చర్ల పట్టణంలో ఈ చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో మహిళలు ఒంటరిగా తిరగాలంటే భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us