AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారీ అమ్మా.. చనిపోతున్నా.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతానికి చెందిన గుంపు రాజేష్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ మొత్తాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. సమాచారం వనపర్తి టౌన్ పోలీసులకు తెలిసింది.

సారీ అమ్మా.. చనిపోతున్నా.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Wanaparthi Cops Rescue Youth From Suicide
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 9:19 AM

Share

మరణం ఏ పరిస్థితుల్లోనైనా రావొచ్చు.. బీ హ్యాపీ ఎవరివన్.. సారీ మమ్మా.. అంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ముందు.. ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.. అది చూసి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకుడిని కాపాడారు.. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతానికి చెందిన గుంపు రాజేష్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ మొత్తాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. సమాచారం వనపర్తి టౌన్ పోలీసులకు తెలిసింది. వెంటనే పట్టణ రెండవ ఎస్సై శశిధర్, కానిస్టేబుళ్లు నారాయణ, అభిషేక్, వినోద్ లు ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటాన్ని గమనించిన పోలీసులు రాజేష్‌ను వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందించడంతో ఒక విలువైన ప్రాణం కాపాడిన వారయ్యారు.

సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం ద్వారా ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్న వనపర్తి పోలీసుల అప్రమత్తత, మానవీయత ప్రజల ప్రశంసలు పొందుతోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఖాకీలు పనిచేస్తున్నారనడానికి ఈ సంఘటన మరో నిదర్శనంగా నిలిచింది.

వీడియో చూడండి..

ఈ ఘటనలో విధి పట్ల నిబద్ధత, మానవీయ దృక్పథాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ సునిత రెడ్డి.. వనపర్తి రెండవ ఎస్సై శశిధర్‌తో పాటు కానిస్టేబుళ్లు నారాయణ, అభిషేక్, వినోద్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి అప్రమత్త చర్యలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఎస్పీ గారు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..