AP PGCET 2026: ఏపీ పీజీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ఏపీ పీజీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపొందిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 9వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువును..

అమరావతి, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపొందిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 9వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువును మార్చి 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకు పీజీసెట్‌కు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ పీజీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ టెక్నా్లజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీ అభ్యర్ధులు రూ.750, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.650 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, బీపీఈడీ వంటి తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన వారు ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026)కు దరఖాస్తు గడువులోగా అప్లై చేసుకోవచ్చు. ఇక పీజీసెట్ 2026 పరీక్షను మే 5 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 28 , 2026.
- రూ.1,000ల ఆలస్య రుసుముతో చివరి తేదీ: మార్చి 23, 2026 .
- రూ.2,000ల ఆలస్య రుసుముతో చివరి తేదీ: మార్చి 27, 2026 .
- రూ.4,000ల ఆలస్య రుసుముతో చివరి తేదీ: మార్చి 31, 2026 .
- రూ.10,000ల ఆలస్య రుసుముతో చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026.
- దరఖాస్తు సవరణ తేదీ: ఏప్రిల్ 5, 2026.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 20, 2026 నుంచి
- ఏపీ పీజీసెట్ 2026 ప్రవేశ పరీక్ష: మే 5 నుంచి 11 వరకు
ఏపీ పీజీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




