AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robot Arrest: రోడ్డుపై వృద్ధురాలిని భయపెట్టిన రోబో.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు! వీడియో వైరల్

తాజాగా పోలీసులు ఓ రోబోను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న ఓ వృద్ధురాలిని వెనుక నుంచి వచ్చి భయపెట్టడమే ఇందుకు కారణం. దీంతో సదరు వృద్ధురాలు తీవ్రంగా భయపడి ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ నేరానికి పాల్పడిన రోబోను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు..

Robot Arrest: రోడ్డుపై వృద్ధురాలిని భయపెట్టిన రోబో.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు! వీడియో వైరల్
Humanoid Robot Arrested
Srilakshmi C
|

Updated on: Mar 17, 2026 | 4:29 PM

Share

సాధారణంగా ఎవరైనా నేరానికి పాల్పడితే పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లో వేస్తుంటారు. అయితే తాజాగా పోలీసులు ఓ రోబోను సైతం అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న ఓ వృద్ధురాలిని వెనుక నుంచి వచ్చి భయపెట్టడమే ఇందుకు కారణం. దీంతో సదరు వృద్ధురాలు తీవ్రంగా భయపడి ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ నేరానికి పాల్పడిన రోబోను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విచిత్ర ఘటన చైనా (China)లోని మకావు (Macau) లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన కథనం ప్రకారం చైనాలోని మకావులో 70 ఏళ్ల వృద్ధురాలు గత గురువారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె తన ఫోన్‌ చూసుకుంటూ ఈవినింగ్ వాకింగ్‌ చేస్తుంది. ఇంతలో యూనిట్రీ G1 మోడల్‌కు చెందిన 4.4 ఆడుగుల ఓ హ్యూమనాయిడ్ రోబో ఆమెను ఫాలో అవడం ప్రారంభించింది. దీంతో భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన ఆమె ఆ రోబో రూపాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసింది. నా వెంట ఎందుకు పడుతున్నావ్. నీకు పిచ్చిపిచ్చిగా ఉందా..? నీ వల్ల భయంతో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అంటూ కాంటనీస్ భాషలో రోబోను ఎడాపెడా తిట్టిపారేసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనతో తీవ్రంగా భయపడిన ఆమెకు శరీరకంగా ఎలాంటి హాని కలగించనప్పటికీ దాని చేష్టలతో అప్పటికే తీవ్రంగా భయపడిన ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించవల్సి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోబోను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల దర్యాప్తులో ఆ రోబో స్థానిక ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందినదని తేలింది. ఈ సంస్థ ప్రతినిధి టోవిన్‌ మాక్‌ వ్యాపార ప్రచారం కోసం రోబోను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్‌ చేస్తూ పరీక్షిస్తున్నాడు. దానిని పరీక్షిస్తున్న క్రమంలో వృద్ధ మహిళ దారి ఇచ్చే వరకు రోబో ఆమె వెనుకే వెళ్లవల్సి వచ్చిందని, ఇంతలో ఆమె భయపడినట్లు తేలిపాడు. దీంతో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో రోబోలను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us