రూ.1కే 24 రోజుల వ్యాలిడిటీ.. రూ.51కే రోజూ 2GB డేటా.. BSNL కొత్త ఆఫర్లు ఇవే!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్స్ పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తమ వినియోగదారులను పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలు అందించే రీఛార్జ్ ప్లాన్లపై దృష్టి సారిస్తోంది. ఇప్పుడు కొత్తగా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.51కే 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం టెలికాం సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు మీకోస ప్రత్యేకంగా..
రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
కాగా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా.. రూ.51కే 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56GB డేటాను వినియోగించుకోవచ్చు. అలానే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇప్పటికే BSNL వినియోగిస్తున్న పాత కస్టమర్లకు వర్తించదని.. కొత్తగా BSNL కనెక్షన్ తీసుకునే వారు మాత్రమే ఈ ప్లాన్‌ను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. దీంతో పాటు మరో రెండు కొత్త ప్లాన్స్ సైతం BSNL ప్రకటించింది.
రూ.1కే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్..
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL మరో ఆసక్తికరమైన ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కేవలం రూ.1 ధరతో లభించే ఈ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 1GB డేటా చొప్పున మొత్తం 24GB డేటా పొందవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి.
రూ.107 ప్లాన్..
ఇక BSNL అందిస్తున్న మరో రీఛార్జ్ ఆప్షన్ రూ.107 ప్లాన్. ఈ ప్లాన్‌లో 20 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో మొత్తం 3GB డేటాతో పాటు 200 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు పొందవచ్చు.
