డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా బీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ స్పష్టంగానే ఉందని కేటీఆర్ తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోకూడదని, పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం వాటాను కచ్చితంగా కాపాడాలని స్పష్టం చేశారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.