కోనసీమలో ‘మూకుడు రొట్టె’కు పెరిగిన డిమాండ్!
మారుతున్న కాలంతో పాటు వంటింట్లోకి గ్యాస్ స్టౌవ్‌లు వచ్చాయి కానీ, కట్టెల పొయ్యిపై చేసే వంటల రుచే వేరు. అందుకే కోనసీమ వాసులకి 'పాత రుచుల'పై మక్కువ తగ్గలేదు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో.. జిల్లాలోని అనేక ఆధునిక హోటళ్లు మూతపడుతున్నాయి. ఇదే సమయంలో కట్టెల పొయ్యిపై వంటలు చేసే పురాతన హోటళ్లకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలోని ఒక పాతకాలపు హోటల్ ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ దశాబ్దాలుగా గ్యాస్‌తో పనిలేకుండా కేవలం కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు తయారు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి ‘మూకుడు రొట్టె’ రుచి చూడటానికి జనం కిలోమీటర్ల దూరం నుండి తరలివస్తున్నారు. ఏసీ గదుల్లో టిఫిన్ చేసే వారు సైతం ఇప్పుడు ఈ ‘కాకా హోటల్’ ముందు క్యూ కట్టడం విశేషం. గ్యాస్ కొరత వల్ల పట్టణాల్లో హోటళ్లు మూతపడటంతో, జనం సంప్రదాయ వంటల వైపు మొగ్గు చూపుతున్నారు. “కట్టెల పొయ్యిపై వండిన ఆహారం కేవలం రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది” అని భోజన ప్రియులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడం, సహజసిద్ధమైన పద్ధతిలో చేసే వంటకాలు దొరుకుతుండటంతో ఈ పాతకాలపు హోటళ్లకు గిరాకీ అమాంతం పెరిగింది. పరిస్థితులు సంక్షోభంలో ఉన్నప్పుడు మనిషి మళ్లీ మూలాల్లోకి వెళ్తాడనే దానికి కోనసీమలోని ఈ దృశ్యాలే నిదర్శనం. ఆధునికతను కాదని, సంప్రదాయానికి పట్టం కడుతున్న కోనసీమ వాసులు.. నిజంగానే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నిరూపిస్తున్నారు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

