అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాతయ్య సంవత్సరీకానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. కనికెళ్ళ రంజిత్ కుమార్ మృతదేహం లభ్యమవగా, మరో యువకుడు, బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.