AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prathyusha: ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డిని క్షమించాలనిపించిందా? ప్రత్యూష తల్లి ఆన్సర్ ఇదే.. వీడియో

Actress Prathyusha: ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డిని క్షమించాలనిపించిందా? ప్రత్యూష తల్లి ఆన్సర్ ఇదే.. వీడియో

Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 9:38 AM

Share

సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ రెడ్డి గురించి ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఏమంటున్నారు? అతనిని ఏమైనా క్షమించే అవకాశముందా? ఆమె నెక్ట్స్ స్టెప్ ఏంటి? తదితర విషయాలను టీవీ తో పంచుకున్నారు ప్రత్యూష తల్లి.

ప్రముఖ సినీ నటి ప్రత్యూష కేసులో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు ప్రధాన నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో ఉన్న అతను సుప్రీం కోర్టు ఆదేశాలతో సుమారు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షా కాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు. చివరకు దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు సిద్ధార్ రెడ్డి. దీనిపై విచారించిన భారత అత్యున్నత న్యాయస్థానం ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇటీవలే నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.

ఈ క్రమంలో తన కూతురుకు న్యాయం జరగాలని సుమారు 24 ఏళ్లుగా పోరాటం చేస్తోంది ప్రత్యూష తల్లి సరోజిని దేవి. మరి సిద్ధార్థ్ రెడ్డి లొంగుబాటుతో ఆమె పోరాటం విజయవంతమైనట్టేనా? ఆమె తర్వాతి స్టెప్ ఏంటి? తదితర విషయాలను టీవీ9తో పంచుకున్నారు. మరి ఆ విషయాలేంటో కింది వీడియోలో చూద్దాం రండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

Follow Us