దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
మహారాష్ట్రలోని తడోబా టైగర్ ప్రాజెక్ట్‌లో ఒక పులి దర్జాగా రోడ్డు దాటుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాహనాల శబ్ధానికి సాధారణంగా జంతువులు భయపడతాయి, కానీ ఈ పులి ఏమాత్రం బెరుకు లేకుండా ముందుకు సాగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తమ ఫోన్లలో పులి కదలికలను రికార్డు చేశారు. ఎవరికీ హాని చేయకుండానే పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అడవికి రాజంటే సింహమే కావచ్చు.. కానీ అడవిలో తన దారికి ఎవరూ అడ్డు రాకూడదని భావించే అసలైన ‘బాస్’ పులి అని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, తడోబా టైగర్ ప్రాజెక్ట్ పరిధిలోని పద్మాపూర్-మొహర్లి రహదారిపై ఒక పులి దర్జాగా రోడ్డు దాటుతూ పర్యాటకులను, వాహనదారులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వాహనాల సౌండ్‌కి అడవి జంతువులు భయపడి పారిపోతాయి. కానీ, ఈ పులి మాత్రం ‘మనకు అలాంటి భయాలేమీ లేవమ్మా’ అన్నట్లుగా ప్రశాంతంగా అడుగులు వేస్తూ రోడ్డుపైకి వచ్చింది. పులి రాకను గమనించిన వాహనదారులు తమ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రొద, మనుషుల అలికిడి చూసి పులి కాస్త బెదిరినట్లు అనిపించినా, వెనక్కి తగ్గకుండా దర్జాగా రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. పులి తమకు అత్యంత సమీపంలో కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను దిగి ఉత్సాహంగా ముందుకు కదిలారు. అది తమపై దాడిచేస్తుందేమోనన్న భయం లేకుండా పులికి అత్యంత సమీపంగా వెళ్తూ తమ సెల్‌ఫోన్లలో పులి కదలికలను రికార్డు చేశారు. ఆ సమయంలో పులి ఆకలితో లేదో ఏమో కానీ, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా తన దారిన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఈ విధంగా చేయండి
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

