AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

Phani CH
|

Updated on: Mar 18, 2026 | 5:16 PM

Share

ఎల్‌పీజీ ఈ-కేవైసీ గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అందరికీ తప్పనిసరి కాదని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు, బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేయని వారు మాత్రమే చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ వినియోగదారులు ఆందోళన చెందనవసరం లేదు. ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లకుండానే ఉచితంగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ‘ఈ-కేవైసీ’ గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం నిర్దేశిత వర్గాలకు మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు, అలాగే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని వారు మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోవాలి. ముఖ్యంగా ఉజ్వల పథకం కింద సబ్సిడీ ప్రయోజనాలు పొందే వారు ప్రతి ఆర్థిక సంవత్సరం దీనిని పూర్తి చేయడం తప్పనిసరి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో, కేంద్రం గృహ వినియోగ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించింది. నకిలీ కనెక్షన్లను ఏరివేసేందుకు ఈ-కేవైసీ ఆదేశాలు ఇవ్వడంతో అందరూ చేయించుకోవాలని భావించి ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడమే తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

Follow Us