AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌  దర్శనం టికెట్ల కోటా విడుదల

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Phani CH
|

Updated on: Mar 18, 2026 | 4:44 PM

Share

టీటీడీ జూన్ 2026 తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 18 నుండి వివిధ తేదీలలో భక్తులు తమ దర్శనం, సేవలు, వసతి కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, కల్యాణోత్సవం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు, వసతి గదులకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

వేసవి సీజన్‌ నడుస్తోంది.. విద్యార్ధుల పరీక్షలు ముగుస్తున్నాయి. దీంతో అందరూ తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోడానికి సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన జూన్‌ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. మార్చి 18న సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోసం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. వీటిని మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాలి. మార్చి 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ttdevasthanams.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌

మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు

Follow Us