AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

Phani CH
|

Updated on: Mar 18, 2026 | 6:22 PM

Share

మధ్యప్రదేశ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. బ్లాక్‌మార్కెట్‌లో గృహ, వాణిజ్య సిలిండర్లు అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ప్రజలు గంటల తరబడి క్యూలలో వేచి ఉంటున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరతతో స్వీట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. డీజిల్ కొరత, PNG-LPG కొత్త నిబంధనలు కూడా సమస్యలను పెంచుతున్నాయి. ఈ సంక్షోభం ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వంట గ్యాస్‌ సంక్షోభంతో బ్లాక్‌మార్కెట్‌ దందా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్‌, యూపీ, పంజాబ్‌, చండీగఢ్‌, హర్యానా, రాజస్థాన్‌లో గ్యాస్‌ కొరతను ఆసరాగా తీసుకుని బ్లాక్‌మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. రూ. 950 గృహ వినియోగ సిలిండర్‌ను రూ.3,500కు, రూ.2,000 వాణిజ్య సిలిండర్‌ను రూ6,500కు బ్లాక్‌లో అమ్ముతున్నారు. చండీగఢ్‌లో ఉదయం 4.30 గంటలకే గ్యాస్‌ ఏజెన్సీ ముందు లైన్‌లో నిలుచుంటున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉండగా, చండీగఢ్‌లో పోలీసుల పర్యవేక్షణలో గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా గ్యాస్‌ కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక పక్క ఎండ నెత్తిని మాడ్చేస్తుండగా, 8 గంటల పాటు క్యూలోనే పడిగాపులు కాసినా సిలిండర్‌ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడగా హర్యానాలో హఠాత్తుగా డీజిల్‌ సంక్షోభం ఏర్పడింది. చాలామంది తమ అవసరాలకు మించి డీజిల్‌ను కొని నిల్వ చేస్తుండటంతో కొరత ఏర్పడింది. వాహనదారులకు అవసరానికి మించి డీజిల్‌, సీఎన్‌జీ అమ్మవద్దంటూ పెట్రోల్‌ పంపు ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆగ్రాలోని స్వీట్‌ పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇక్కడ బూడిద గుమ్మడితో తయారు చేసే ప్రసిద్ధ పేఠా స్వీట్‌కు కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు తయారీ యూనిట్లను మూసివేశారు. గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిశ్రమను మూసేయాల్సి ఉంటుందని అంటున్నారు. పైప్‌డ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్‌ ఉన్నవారికి ఎల్పీజీ కొత్త కనెక్షన్‌ ఇవ్వడం కానీ, వారి పాత సిలిండర్‌లోకి గ్యాస్‌ నింపడం కానీ చేయరు. అంతేకాక, వారి ఎల్పీజీ సిలిండర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకే ఇంటిలో పీఎన్‌జీ, ఎల్పీజీ కనెక్షన్‌ ఉండటం చట్టవిరుద్ధంగా భావిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్యాస్‌ బుక్‌ చేయాలంటే తమ పాత గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా తేదీకి, ప్రస్తుతం బుక్‌ చేస్తున్న తేదీకి పట్టణంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి ఉండాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

Follow Us