AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

Vasantha Navaratri 2026: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పర్వాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మిక మేల్కొలుపుకు ప్రతీకగా భావించబడతాయి. ఈ కాలంలో దేవీ ఉపాసన, వ్రతాలు ఆచరించడం వల్ల శారీరక, మానసిక శక్తులు పెరిగి సకల కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం.

Rajashekher G
|

Updated on: Mar 19, 2026 | 3:06 PM

Share
వసంత నవరాత్రుల ప్రత్యేకత.. 

వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తి, నియమ నిష్టలతో గడపడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు.

వసంత నవరాత్రుల ప్రత్యేకత.. వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తి, నియమ నిష్టలతో గడపడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు.

1 / 5

రామాయణ పారాయణ ప్రాముఖ్యం.. 

ఈ సమయంలో లలితా సహస్రనామ పారాయణ, దేవీ పూజలు చేయడం ద్వారా జ్ఞానం, సంపద, బలం పెరుగుతాయని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలతో రామాయణ పారాయణం చేసే ఆచారం విస్తృతంగా ఉంది. రామచంద్రుడిని లలితాదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. రామలీలా ఉత్సవాల రూపంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. దక్షిణ భారతదేశంలో అయితే శరన్నవరాత్రులలో దేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

రామాయణ పారాయణ ప్రాముఖ్యం.. ఈ సమయంలో లలితా సహస్రనామ పారాయణ, దేవీ పూజలు చేయడం ద్వారా జ్ఞానం, సంపద, బలం పెరుగుతాయని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలతో రామాయణ పారాయణం చేసే ఆచారం విస్తృతంగా ఉంది. రామచంద్రుడిని లలితాదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. రామలీలా ఉత్సవాల రూపంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. దక్షిణ భారతదేశంలో అయితే శరన్నవరాత్రులలో దేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

2 / 5

దేవి ఆరాధన విధానం.. 

నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి దీక్ష ప్రారంభించాలి. ప్రతి రోజు ఉపవాసం పాటించి సాయంత్రం దేవి పూజ చేయాలి. లలితా సహస్రనామం, దుర్గా స్తుతి పారాయణ చేయాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం పంచాలి. ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించి సత్కరించడం శుభప్రదంగా భావిస్తారు.

దేవి ఆరాధన విధానం.. నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి దీక్ష ప్రారంభించాలి. ప్రతి రోజు ఉపవాసం పాటించి సాయంత్రం దేవి పూజ చేయాలి. లలితా సహస్రనామం, దుర్గా స్తుతి పారాయణ చేయాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం పంచాలి. ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించి సత్కరించడం శుభప్రదంగా భావిస్తారు.

3 / 5

శ్రీరామ పూజ విధానం.. 

వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.

శ్రీరామ పూజ విధానం.. వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.

4 / 5

పాటించాల్సిన నియమాలు.. 

ఇంట్లో అఖండ దీపం వెలిగించి ఉంచాలి
గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి
భూశయనం పాటించాలి
శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి
భక్తిశ్రద్ధలతో నియమాలు కచ్చితంగా పాటించాలి
ఈ విధంగా వసంత నవరాత్రులను ఆచరిస్తే దేవి అనుగ్రహం, శ్రీరాముని కృప లభించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

పాటించాల్సిన నియమాలు.. ఇంట్లో అఖండ దీపం వెలిగించి ఉంచాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి భూశయనం పాటించాలి శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి భక్తిశ్రద్ధలతో నియమాలు కచ్చితంగా పాటించాలి ఈ విధంగా వసంత నవరాత్రులను ఆచరిస్తే దేవి అనుగ్రహం, శ్రీరాముని కృప లభించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

5 / 5
Follow Us