జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాధాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసం భర్త హరిబాబే ఆమెను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదయ్యాయి.