AP Lawcet 2026 Exam Date: ఏపీ లాసెట్ దరఖాస్తుకు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్.. లింక్ ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఐదేళ్ల, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్ కోర్సుల్లో 2026-27 సంత్సరానికి ప్రవేశాలకు ఏపీ లాసెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ కోసం ఏపీ జీఎల్‌సెట్ 2026కు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు..

అమరావతి, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఐదేళ్ల, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్ కోర్సుల్లో 2026-27 సంత్సరానికి ప్రవేశాలకు ఏపీ లాసెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ కోసం ఏపీ జీఎల్‌సెట్ 2026కు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మార్చి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది లా సెట్ ప్రవేశ పరీక్షను శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లాసెట్ ప్రవేశ పరీక్ష మే 4, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
దరఖాస్తు సమయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900. బీసీ అభ్యర్ధులు 850. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.800 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.900 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 24, 2026.
- రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 28, 2026.
- రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 1, 2026.
- రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 6, 2026.
- దరఖాస్తుల సవరణ తేదీ: ఏప్రిల్ 8, 2026.
- లాసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 20, 2026.
- లాసెట్ పరీక్ష తేది: మే 4, 2026.
- ప్రైమరీ ఆన్సర్ కీ విడుదల: మే 7, 2026 .
- ఫైనల్ కీ విడుదల: జూన్ 16, 2025.
- లాసెట్ ఫలితాల విడుదల తేదీ: మే 18, 2026.
ఏపీ లాసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




