AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vira Video: పెరూలో పట్టపగలే నడిరోడ్డుపై కాల్పుల్లో.. తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు

దక్షిణ అమెరికాలోని పెరూ కోస్టా వెర్డే ఫ్లైఓవర్‌పై పట్టపగలే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు ఓ ఎస్‌యూవీ కారుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ భారతీయ యువకుడితో పాటు పెరూకు చెందిన మరో మహిళ కూడా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Vira Video: పెరూలో పట్టపగలే నడిరోడ్డుపై కాల్పుల్లో.. తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు
Peru Flyover Shooting
Anand T
|

Updated on: Nov 28, 2026 | 12:42 PM

Share

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెరూ రాజధాని లిమా సమీపంలోని కల్లావోలో ఉన్న లా పెర్లా ప్రాంతంలోని బ్రిడ్జ్‌పై ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన విజయ్ పగ్రాని సహా మరికొందరు కారులో జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా, కోస్టా వెర్డే ఫ్లైఓవర్‌పై కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. అనంతరం కారులో ఉన్న కొన్ని బ్యాగులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో విజయ్ పగ్రానితో పాటు పెరూకు చెందిన ఓ మహిళ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరికీ అక్కడ చికిత్స జరుగుతోంది.

అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. దుండగులు దాడికి పాల్పడిన కారులో బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఆ ఆభరణాలు ఎవరివి.. వాటి విలువ ఎంత అనే దాని గురించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ దోపిడీ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడిపై కల్లావో పోలీస్ చీఫ్ జనరల్ ఓల్గర్ బెనావిడెస్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఈ దోపిడీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోందన్నారు. నిందితులు కారును ముందు నుంచే ఫాలో అవుతూ టైం చూసి దాడికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. అయితే, ఈ ఘటనకు ఏదైనా కార్టెల్ లేదా ఇతర నేర ముఠాతో సంబంధం ఉందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us