AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idupu Kayitham : అదిరిపోయింది భయ్యా.. ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్.. గంటలోనే యూట్యూబ్‏లో ట్రెండింగ్..

ఇన్నాళ్లు ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగదుర్గ ఇప్పుడు కథానాయికగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇడుపు కాయితం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో పాటను విడుదల చేసింది చిత్రయూనిట్.

Idupu Kayitham : అదిరిపోయింది భయ్యా.. ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్.. గంటలోనే యూట్యూబ్‏లో ట్రెండింగ్..
Idupu Kayitham
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2026 | 12:11 PM

Share

టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. హీరోగా బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత సేవ్ ది టైగర్స్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రియదర్శి, ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇడుపు కాయితం. మొదటి నుంచి ఈ మూవీ పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉల్లిపూల అంటూ సాగే ఈ లిరికల్ వీడియోను విడుదల చేశారు. గ్రామీణ వాతావరణం, సహజమైన సన్నివేశాలు, ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉల్లిపూల సీరే గట్టి ఉత్తరాది సెరువే దాటి.. బండి మీద నీతో పోంగరా నా శ్రీనివాసా.. ఉండలేను ఉన్న తీరుగా. అంటూ సాగే ఈ పాటలో జానపద శైలి, ఆధునిక సంగీతపు హంగులు చక్కగా మేళవించాయి. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన బాణీ పాటకు ప్రాణం పోయగా, అభినయ శ్రీనివాస్ రాసిన సాహిత్యం సహజంగా, సరదాగా సాగుతూ శ్రోతలను అలరిస్తోంది. గాయని హెనాగ్రేస్ తన గాత్రంతో పాటలోని ఉత్సాహాన్ని, భావోద్వేగాన్ని చక్కగా పలికించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

లిరికల్ వీడియోలో ప్రియదర్శి, నాగ దుర్గ మధ్య కనిపించే కెమిస్ట్రీ, గ్రామీణ నేపథ్యంలోని రంగురంగుల దృశ్యాలు, నృత్య సన్నివేశాలు పాటను మరింత ఆకర్షణీయంగా నిలబెట్టాయి. రాఘు వి మాస్టర్ కొరియోగ్రఫీ, ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆశిష్ తేజ ఆర్ట్ డైరెక్షన్ పాట విజువల్‌గా కూడా ప్రత్యేకంగా నిలిచేలా తీర్చిదిద్దాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

వంశీ రెడ్డి దొండపాటి రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఇడుపు కాయితం చిత్రాన్ని బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, తాజాగా ఉల్లిపూల సాంగ్‌తో మరింత బజ్‌ను సొంతం చేసుకుంది. ఇడుపు కాయితం చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పల్లెటూరి సొగసు, ప్రేమ, అనుబంధాల మేళవింపుతో వస్తున్న ఈ సినిమా, విడుదలైన పాటలతోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఉల్లిపూల చీరకట్టి సాంగ్..

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us