AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లి కావడం లేదని.. ఎంత పనిచేశావ్ విజయలక్ష్మి.. ఓ సాఫ్ట్‌వేర్ విషాద గాథ..

కన్న తల్లికి వైకల్యం.. పెళ్లి కావడం లేదన్న మనోవేదన.. ఒకవేళ పెళ్లయితే.. కన్నతల్లిని ఎవరు చూసుకుంటారన్నే వేదన.. ఇలా తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ నిర్ణయం తీసుకుంది. బయటకు వెళ్లొస్తానని చెప్పి.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది..

Hyderabad: పెళ్లి కావడం లేదని.. ఎంత పనిచేశావ్ విజయలక్ష్మి.. ఓ సాఫ్ట్‌వేర్ విషాద గాథ..
Hyderabad Software engineer suicide
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2026 | 9:07 AM

Share

కన్న తల్లికి వైకల్యం.. పెళ్లి కావడం లేదన్న మనోవేదన.. ఒకవేళ పెళ్లయితే.. కన్నతల్లిని ఎవరు చూసుకుంటారన్నే వేదన.. ఇలా తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ నిర్ణయం తీసుకుంది. బయటకు వెళ్లొస్తానని చెప్పి.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయలక్ష్మి(26) హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 31వ తేదీన రెండు రోజుల్లో తిరిగి వస్తానని.. కూకట్‌పల్లిలోని తల్లికి చెప్పి బయటకు వెళ్లిన విజయలక్ష్మి హుస్సేన్‌సాగర్ లో దూకి ప్రాణాలు తీసుకుంది.. బయటకు వెళ్లిన విజయలక్ష్మి ఫోన్ అందుబాటులోకి రాకపోవటంతో.. విజయలక్ష్మి బంధువు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హుస్సేన్ సాగర్‌లో విజయలక్ష్మి మృతదేహం లభించటంతో, కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు లేక్ పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్‌ విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా ఉండదు.. ప్రస్తుతం కూకట్‌పల్లి పరిధి మైత్రినగర్‌లో విజయలక్ష్మి తల్లితో కలిసి నివాసముంటోంది. వైకల్యంతో బాధపడుతున్న తల్లికి.. ఐటీ సంస్థలో పనిచేస్తూనే విజయలక్ష్మి.. అన్నీ తానై సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

అయితే.. ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్ష్మికి పలు వివాహ సంబంధాలు వచ్చాయి. కానీ.. తల్లి తనతోపాటే ఉంటుందని విజయలక్ష్మి వారికి చెబుతూ వస్తోంది.. దీంతో వారు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తీవ్ర మనస్థాపానికి లోనైంది.. ఓ వైపు తల్లికి అనారోగ్యం.. వైకల్యం.. మరో వైపు పెళ్లి కావడం లేదన్న బాధ.. ఇలా.. విజయలక్ష్మి సతమతమవుతూ.. శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి.. హుస్సెన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. హుసేన్‌సాగర్‌లో సోమవారం మృతదేహం లభ్యం కాగా.. పోలీసులు ఆ మృతదేహం విజయలక్ష్మి దేనని నిర్ధారించారు.

అయితే.. కన్నతల్లికి కంటిరెప్పలా కాపాడుకుంటున్న విజయలక్ష్మి చనిపోవడంతో.. ఆ తల్లిని ఎవరు చూసుకుంటారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..