నైజాంలో హైక్స్ లేకుండానే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఇండస్ట్రీకి టార్చ్ బేరర్ అవుతారా?
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నైజాంలో నార్మల్ టికెట్ రేట్లతో విడుదలవుతోంది. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచే ఆనవాయితీని బ్రేక్ చేస్తూ, ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు వస్తోంది. ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందా, భవిష్యత్ సినిమాలకు టార్చ్ బేరర్ అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
“నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను” అన్న పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆయన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతోంది. పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ రూల్‌ను బ్రేక్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ టీం నైజాంలో (తెలంగాణ) ఎలాంటి ధరల పెంపూ లేకుండానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నిర్ణయంతో సామాన్య ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ కండిషన్స్ ఉన్నప్పటికీ, మేకర్స్ హైక్ కోసం ఎదురుచూడకుండా బుకింగ్స్ ఓపెన్ చేయడం గమనార్హం. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి భారీ టికెట్ రేట్స్ కారణంగా ఫుట్ ఫాల్స్ తగ్గాయన్న అనుమానాలు ఉండటంతో, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. కలెక్షన్ రికార్డుల కన్నా ఫుట్ ఫాల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ కొత్త విధానం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా, ఇతర పెద్ద సినిమాల మేకర్స్‌ను రీ-థింక్ చేయిస్తుందా అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం :
ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

