AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమతాకుంభ్–2026: బ్రహ్మోత్సవాల్లో సాకేత రాముని ప్రత్యేక సేవలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

Samatakumbh 2026: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరిలో 'సమతాకుంభ్–2026' కనుల పండవుగా సాగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల్లో ఆధ్మాత్మిక వెల్లి విరిస్తోంది. ప్రాత:కాల ఆరాధన మొదలు విరాట్‌ విష్ణు సహస్రనామ పారాయణ.. సాయంత్రం పూర్ణాహుతి..రాత్రి గరుడ సేవల వరకు ప్రతి ఘట్టం అద్భుతం..అనిర్వచనీయం అన్నట్టుగా సాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో నిన్న నాలుగో రోజు జరిగిన వేడుకలు.. నేడు జరగనున్న ఉత్సవాల విశేషాలను చూద్దాం.

సమతాకుంభ్–2026: బ్రహ్మోత్సవాల్లో సాకేత రాముని ప్రత్యేక సేవలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
Samathakumbh 2026
Rajashekher G
|

Updated on: Feb 03, 2026 | 11:26 AM

Share

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరిలో ‘సమతాకుంభ్–2026’ కనుల పండవుగా సాగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల్లో ఆధ్మాత్మిక వెల్లి విరిస్తోంది. ప్రాత:కాల ఆరాధన మొదలు విరాట్‌ విష్ణు సహస్రనామ పారాయణ.. సాయంత్రం పూర్ణాహుతి..రాత్రి గరుడ సేవల వరకు ప్రతి ఘట్టం అద్భుతం..అనిర్వచనీయం అన్నట్టుగా సాగుతోంది.

సమతాకుంభ్–2026 బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఉదయం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోమవారం ఉదయం ఆరాధన కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సామూహిక రామానుజ నూత్తందాది పారాయణం నిర్వహించారు. “అందరూ సమానం” అనే శ్రీరామానుజాచార్యులవారి మహోన్నత సందేశాన్ని ఈ సందర్భంగా భక్తులకు గుర్తు చేశారు. నూత్తందాది పారాయణం ద్వారా ఆచార్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరావు దంపతులు

పారాయణం అనంతరం 19 నుంచి 36 దివ్యదేశాల దేవుళ్లకు తిరుమంజన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ, 37 నుంచి 54 దివ్యదేశాధీశులకు గరుడ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు.

సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం తిరుమంజన సేవ అనంతరం డోలోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ ఏర్పాటు చేశారు. అదే విధంగా 55 నుంచి 72 దివ్యదేశములలో కొలువుదీరిన దివ్యదేశాధీశులకు 18 గరుడ వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.

కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్