పల్నాడులో తీవ్ర విషాదం.. ప్రేమ వివాహం వద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య..!
పోలీసులు చౌడేశ్వరి ఆచూకీ కనుగొనడంలో జాప్యం జరిగింది. దీంతో వారం రోజుల తర్వాత రాత్రి సమయంలో శ్రీనుతో పాటు అతని బంధువులు మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. తమ కుమార్తె ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా అని వాకబు చేసుకున్నారు. పోలీసులు ఎటువంటి సమాచారం లేదని చెప్పడంతో ఆవేదనకు లోనయిన శ్రీను పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ప్రేమించిన వ్యక్తి దూరం కావడాన్ని తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పల్నాడు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణంలోని 22 వార్డుకు యాదవ బజార్ కు చెందిన చంద్ర శ్రీనుకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చౌడేశ్వరి (21) ఇంటర్ చదివి ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటుంది. అయితే జమ్మలమడకకు చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇంటిలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమికులు మార్చి నాలుగో తేదీన ఇంటిలో నుండి వెళ్లిపోయారు. అయితే కుమార్తె కనిపించకపోవడంతో శ్రీను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు చౌడేశ్వరి ఆచూకీ కనుగొనడంలో జాప్యం జరిగింది. దీంతో వారం రోజుల తర్వాత రాత్రి సమయంలో శ్రీనుతో పాటు అతని బంధువులు మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. తమ కుమార్తె ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా అని వాకబు చేసుకున్నారు. పోలీసులు ఎటువంటి సమాచారం లేదని చెప్పడంతో ఆవేదనకు లోనయిన శ్రీను పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి అతనిపై నీళ్ళు పోసి ప్రాణాలు రక్షించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చౌడేశ్వరి, నాగరాజులు ఎక్కుడున్నారో కనుగొన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అందరూ సుఖాంతం అయిందని భావించారు.
తాజాగా నాగరాజుతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం ఇద్దరిని వీడదీసినట్లు భావించిన చౌడేశ్వరి రెండు రోజులు తర్వాత శ్రీను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రేమ వివాహం వద్దన్నందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. కుమార్తెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రేమ వివాహాన్ని వద్దంటే ఏకంగా తానే లేకుండా పోయిందంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని తాము భావించలేదన్నారు. రెండు మూడు రోజుల పాటు అందరితో మామూలుగానే ఉన్న చౌడేశ్వరి ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
