AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాంటి అశ్లీలత లేదు.. నా అనుమతి లేకుండా ఎలా చేస్తారు..? బూతు పాట పై నోరా ఫతేహి

కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ’ చిత్రంలోని సర్కే చునార్ తేరీ సర్కే పాట తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ స్పెషల్ పాటలో డబుల్ మీనింగ్ పదాలు ఉన్నాయని.. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అత్యంత దారుణంగా.. జుగుప్సాకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడ్డారు.

ఎలాంటి అశ్లీలత లేదు.. నా అనుమతి లేకుండా ఎలా చేస్తారు..? బూతు పాట పై నోరా ఫతేహి
Nora Fatehi
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 5:25 PM

Share

ప్రస్తుతం ఒకే ఒక్క సాంగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ చూసిన అదే సాంగ్ మీద చర్చ జరుగుతుంది. బూతు పాట అని కేంద్రం కూడా దాని మీద సీరియస్ అయ్యింది. అదే కన్నడ  యాక్షన్ డ్రామా మూవీ కేడీ: ది డెవిల్ సినిమాలోని సర్కే చునార్ తేరీ సర్కే (తెలుగులో ‘జరిపే నాతో పండగ జరిపే’) పాట. ప్రస్తుతం ఏ పాట తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలోని హిందీ లిరిక్స్ అత్యంత అసభ్యకరంగా, బూతులుఅలాగే డబుల్ మీనింగ్‌తో ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని విమర్శలు తెగ వినిపిస్తున్నాయి. నెటిజన్స్ మాత్రమే కాదు ప్రముఖులు కూడా ఈ సాంగ్ పై విమర్శలు గుప్పించారు. సింగర్ అర్మాన్ మాలిక్, నటి కంగనా రనౌత్, అలాగే ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వంటి ప్రముఖులు ఈ పాటపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

అంతటితో ఆగలేదు.. లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. ఈ పాటపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. ఇక పాటను ఆలపించిన సింగర్ మంగ్లీ పై కూడా విమర్శలతో పాటు కేసు కూడా నమోదు ఫైల్ అయ్యింది. దాంతో మంగ్లీ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, అది ఒక పొరపాటని పేర్కొంటూ అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి పాటను తొలగించినట్లు తెలిపారు. అలాగే వివాదాస్పదమైన ఈ పాటను యూట్యూబ్ అలాగే  ఇతర మ్యూజిక్ యాప్స్ నుంచి తొలగించారు. దర్శకుడు ప్రేమ్ సాహిత్యాన్ని మార్చి త్వరలోనే కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

ఇదిలా ఉంటే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నోరా ఫతేహి ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. తాను ఈ పాటను మూడు సంవత్సరాల క్రితమే కన్నడ భాషలో షూట్ చేశానని, అప్పట్లో చిత్ర యూనిట్ తనకు వివరించిన అర్థంలో ఎలాంటి అశ్లీలత లేదని నోరా స్పష్టం చేసింది. తనకు కన్నడ రాదు కాబట్టి మేకర్స్ చెప్పిన మాటలనే నమ్మానని తెలిపింది. ఈ హిందీ వెర్షన్ లిరిక్స్ గురించి తనకు తెలియదని, దీని కోసం మేకర్స్ తన అనుమతి గానీ, కనీసం సమాచారం గానీ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మొదటిసారి హిందీ వెర్షన్ విన్నప్పుడే అది ఇబ్బందికరంగా ఉందని తాను గ్రహించానని, ఈ పాట వల్ల ఖచ్చితంగా విమర్శలు వస్తాయని దర్శకుడిని ముందే హెచ్చరించానని ఆమె తెలిపింది. పాటలోని సాహిత్యం అసభ్యకరంగా ఉండటంతో తాను ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగానని, అందుకే ఈ పాటను ఎక్కడా ప్రమోట్ చేయలేదని నోరా చెప్పుకొచ్చింది.

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us