AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : వామ్మె నా వల్ల కాలేదు.. కోహ్లీ ఇచ్చిన ఆ సలహా ఎక్కువ కాలం పాటించలేకపోయానన్న సంజూ

Sanju Samson : టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తన కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫిట్‌నెస్, డైట్ సలహాలను ఏడాదిన్నర మాత్రమే పాటించగలిగానని వెల్లడించాడు. ఇకపై ఇతరుల కోసం కాకుండా తన సహజమైన ఆటతోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు.

Sanju Samson : వామ్మె నా వల్ల కాలేదు.. కోహ్లీ ఇచ్చిన ఆ సలహా ఎక్కువ కాలం పాటించలేకపోయానన్న సంజూ
Sanju Samson
Rakesh
|

Updated on: Jul 28, 2026 | 9:27 AM

Share

Sanju Samson : భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన క్రికెట్ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోనని, స్వయం నిర్ణయాలతోనే ముందుకెళ్తానని స్పష్టం చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందే క్రికెట్‌లో ఉండే అనవసర పోటీ లేదా ర్యాట్ రేస్ నుంచి తప్పుకోవాలని భావించినట్లు తెలిపారు. తన సహజ సిద్ధమైన ఆట తీరుపైనే నమ్మకం ఉంచుతానని, ఇకపై తన కెరీర్‌కు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని తనే సొంతంగా తీసుకుంటానని సంజూ శాంసన్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు.

విమర్శలపై శాంసన్ ఘాటు స్పందన

టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన శాంసన్, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో ఫామ్ కోల్పోయాడు. వరుసగా విఫలం కావడంతో అతనికి జింబాబ్వే పర్యటనలో చోటు దక్కలేదు. అయినప్పటికీ విమర్శలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని శాంసన్ పేర్కొన్నారు. భారత్‌లో ఆటగాళ్ల మధ్య నిరంతరం పోలికలు, విపరీతమైన పోటీ వాతావరణం ఉంటుందని, అయితే తాను మాత్రం ఆ ఒత్తిడిని తలకెక్కించుకోనని చెప్పారు. 31 ఏళ్ల వయసులో ప్రతి మ్యాచ్‌ను ఎంతో ఆస్వాదిస్తూ, సొంత నిబంధనలతో ఆడుతూ క్రికెట్‌ను ఎంజాయ్ చేయడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకుండా వర్తమానంపైనే దృష్టి పెడతానని తెలిపారు.

విరాట్ కోహ్లీ ఇచ్చిన అమూల్యమైన సలహా

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జరిగిన ఒక ప్రత్యేక సంభాషణను శాంసన్ గుర్తు చేసుకున్నారు. జాతీయ జట్టు క్యాంప్ సమయంలో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా, సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించడానికి ఏం చేయాలని విరాట్‌ను అడిగినట్లు శాంసన్ వెల్లడించారు. దానికి విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన పోషకాహారం, ఫిట్‌నెస్, రికవరీకి ప్రాధాన్యం ఇవ్వడమే సుదీర్ఘ కెరీర్‌కు అసలైన కీ అని సలహా ఇచ్చారని చెప్పారు. ఏ ఆహారం శరీరానికి మంచిది, ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా విరాట్ తన అనుభవాలను పంచుకున్నారని తెలిపారు.

సలహా పాటించినా.. ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయా

విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలను తాను దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో నిజాయితీగా పాటించానని సంజూ శాంసన్ చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ కఠినమైన క్రమశిక్షణను నిరంతరం కొనసాగించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆట పట్ల విరాట్‌కు ఉన్న అంకితభావం, కఠినమైన ఫిట్‌నెస్ సూత్రాలు ప్రతి ఒక్క యువ ఆటగాడికి ఎంతో స్ఫూర్తిదాయకమని శాంసన్ కొనియాడారు. జట్టుకు తన అవసరం ఉన్నప్పుడు, తగిన ప్రదర్శన ఇస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us