AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

ఆర్కే రోజా.. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు రోజా. సినిమాలు, రాజకీయాలతోనే కాదు బుల్లితెరపై కూడా సందడి చేసి ప్రేక్షకులను అలరించారు రోజా. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు రోజా.. తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ
Roja
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 8:33 PM

Share

నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. కాగా రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ రాణిస్తోంది. కాగా అన్షు మాలిక పెళ్లి గురించి గతకొన్ని రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఓ ఇంటర్వ్యూలో రోజా దీని పై క్లారిటీ ఇచ్చారు. ఓ స్టార్ హీరో ఇంటికి రోజా కూతురు కోడలిగా వెళ్తుందని టాక్ చక్కర్లు కొడుతుంది.

గతంలో రోజా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. 1991లో తన మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే తన భర్త సెల్వమణికి తనపై ప్రేమ కలిగిందని రోజా అన్నారు. తాను ఆ సమయంలో చాలా చిన్నదానిని కావడం, భాష (తమిళం) తెలియకపోవడం వల్ల ప్రేమ గురించి పెద్దగా ఆలోచించలేదని చెప్పారు. సెల్వమణి తన కుటుంబ బంధాలను చూసి ఆకట్టుకుని, నేరుగా తన తల్లిదండ్రులను అడిగి తన ప్రేమను వ్యక్తపరిచారని తెలిపారు రోజా. 1991లోనే నిశ్చితార్థం జరిగినప్పటికీ, వివాహం ఆలస్యమైందని చెప్పారు. అదేవిధంగా తమ కుటుంబంలో సెల్వమణి గారే నిశ్శబ్దంగా ఉండే కఠినమైన వ్యక్తి అని, పిల్లలు కూడా ఆయనకే భయపడతారని నవ్వుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి

తన కుమారుడు కౌశిక్ గురించి మాట్లాడుతూ.. ఏడవ నెలలో కౌశిక్ ప్రీమెచ్యూర్ బేబీగా జన్మించాడని తెలిపారు రోజా. అందుకే తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాననితెలిపారు. కౌశిక్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నాడని, దర్శకత్వం లేదా నటనలో ఏదైనా ఎంచుకోవచ్చని రోజా అన్నారు. అలాగే తన కూతురు అనుషుమాలిక గురించి బయట ప్రచారంలో ఉన్న స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళే అవకాశం అనే వార్తలను ఆమె నవ్వుతూ ఖండించారు. తన చెవికి అలాంటి ప్రపోజల్స్ ఏమీ రాలేదని స్పష్టం చేశారు. అనుషుమాలికకు చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉందని, అమెరికాలో చదువుకుంటుందని, శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉందని రోజా తెలిపారు. ఆమె చిన్నతనం నుంచే సామాజిక సేవ, సహాయ గుణం కలిగి ఉందని, అనేక మంది పిల్లల చదువుకు సహాయం చేస్తుందని, అనేక అవార్డులు గెలుచుకుందని చెప్పారు.  తమ పిల్లల విషయంలో, తల్లిదండ్రులుగా తాము డాక్టర్లు, ఇంజనీర్లు కాలేదని వారిని బలవంతం చేయమని, వారికి ఏది నచ్చితే అది సరైనదా కాదా చూసి ఆ మార్గంలో ప్రోత్సహిస్తామని రోజా చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Anshu (@anshuselv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us