AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే ..

లిటిల్ సోల్జర్స్.. 1996లో విడుదలైన ఒక తెలుగు సినిమా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా చిన్న పిల్లలతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కామెడీ, క్రైమ్, సస్పెన్స్‌ ఇలా అన్ని అంశాలున్న ఈ సినిమాలో ఉంటాయి.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే ..
Little Soldiers
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 9:18 PM

Share

ఇటీవల కాలంలో హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను గూగుల్ లో తెగ గాలించేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో లిటిల్ సోల్జర్ అనే సినిమా ఒకటి. విబిబిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలే ప్రధాన పాత్రధారులు. ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. లిటిల్ సోల్జర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారిలో బాలాదిత్య ఒకరు. బాలాదిత్య ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6లో కాంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మరో చిన్నారి ఎవరో తెలుసా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఈ సినిమాలో చిన్న పాపగా నటించిన ఆమె పేరు కావ్య. లిటిల్ సోల్జర్స్ సినిమాలో కావ్య చిలిపి చేష్టలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ మరియు కావ్య అన్నపరెడ్డికి ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాలో కావ్య తన క్యూట్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

లిటిల్ సోల్జర్స్ సినిమా తర్వాత కావ్య పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది ఈమె. కావ్య ప్రస్తుతం డాక్టర్ గా స్థిరపడింది. కుశాల్ హిప్పల్‌గావ్‌కర్‌తో కావ్య వివాహం జరిగింది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్నిఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కావ్య సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండదు. ఆమె ఫోటోలు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

Kavya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us