AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు రెండు సినిమాలను లైనప్ చేశారు. ఇదిలా ఉంటే వెంకటేష్ తన ప్రాణం కాపాడారని ఓ నటుడు తెలిపారు.

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 9:37 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు తమ ప్రతిభతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల హావ నడుస్తుంది. కొత్త కొత్త సినిమాలు, కొత్త దర్శకులను పరిచయం చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అయితే ఒకప్పుడు హీరోగా చేసిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా విలన్స్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. కొంతమంది పూర్తిగా కనిపించకుండా మాయం అయ్యారు కూడా. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు. ఆతర్వాత హీరోగా మారాడు. కానీ హీరోగా మారిన మనోడికి అదృష్టం కలిసి రాలేదు. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ఇప్పుడు ఆడపడదపా సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. అతను ఎవరో కాదు నటుడు బాలాదిత్య.

బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, మూడు దశాబ్దాలకు పైగా సినీ, టెలివిజన్ రంగాలలో తనదైన ముద్ర వేసిన నటుడు బాలాదిత్య కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . బాలాదిత్య 1991 జూన్ 13న తన ఆరవ ఏట ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చిత్రంతో అరంగేట్రం చేశాడు. దాసరి నారాయణరావు తొలి క్లాప్‌నివ్వగా, రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ తనను “స్టాంప్” అని పిలవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు బాలాదిత్య. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సంఘటనలలో ఒకటైన సూపర్ పోలీస్ సినిమా షూటింగ్‌లో వెంకటేశ్ తన ప్రాణాలను ఎలా కాపాడారో బాలాదిత్య వెల్లడించాడు.

ఈ సంఘటన ఆయన జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. సూపర్ పోలీస్ సినిమా షూటింగ్ లో చితికి తాను నిప్పు పెట్టె సన్నివేశం ఉందట.. అయితే ఆ సమయంలో మంట అంటుకోకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బంది ఒకరు. ఆ చితిపై పెట్రోల్ పోశారట.. ఆ క్రమంలో పెట్రల్ తన పై పడబోయిందట.. ఆ సమయంలో వెంకటేష్ వెంటనే గమనించి తనను పక్కకు లాగి కాపాడారని.. లేదంటే ఆ పెట్రోల్ తనపై కూడా పడితే మంటలు అంటుకునేవి అని బాలాదిత్య గుర్తు చేసుకున్నాడు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి
Baladitya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us