Singer Mangli: బూతుపాట పాడి వివాదంలో ఇరుక్కున్న సింగర్ మంగ్లీ.. కేసు నమోదు
టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ సింగర్స్ లో మంగ్లీ పేరు కూడా ఉంటుంది. తనదైన గాత్రంతో అద్భుతంగా పాటలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మంగ్లీ. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ.

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మంగ్లీ ఊహించని వివాదంలో చిక్కుకుంది. మంగ్లీ ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ బిజీగా ఉంది.. ఈ క్రమంలోనే ఆమె ఓ కన్నడ సినిమాకు పాట పాడింది. కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం KD: ది డెవిల్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమానుంచి “సర్కే చునర్ తేరి సర్కే” అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే
ఈ సాంగ్ ఇప్పుడు వివాదంలో చుక్కుకుంది. సర్కే చునర్ తేరి సర్కే సాంగ్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్స్ ఈ పాట పై పెద్దెత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఇది బూతు పాట అంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. కాగా ఈ పాట పై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికెట్, అలాగే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు.
వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!
ఈ పాట మైనర్ల పై చేడు ప్రభావం చూపే విధంగా ఉందని.. పాటను వెంటనే తొలగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ఈ పాట కోసం పనిచేసిన సంగీత దర్శకులు గాయని గాయకులపై కూడా ఫిర్యాదులు వెళ్లాయిసినిమా దర్శకుడు ప్రేమ్, ఈ పాట రచయిత రాకీబ్ ఆలం, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అలాగే సింగర్ మంగ్లీ పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారని తెలుస్తుంది. విమర్శలు రావడంతో సాంగ్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇక దీని పై సింగర్ మంగ్లీ స్పందించలేదు.
Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




