AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం పాట రా బాబు..! మైండ్‌లోనుంచి పొవట్లే..!! లవర్స్ తెగ పాడేసుకుంటున్న సాంగ్

సినిమాలతో పాటు సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా సినిమాల్లోని సాంగ్స్ మాత్రం మంచి హిట్స్ గా నిలుస్తాయి. కొన్ని సినిమాల్లోని పాటలు ఆడియన్స్ మైండ్ లో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సాంగ్ ఒకటి.

ఏం పాట రా బాబు..! మైండ్‌లోనుంచి పొవట్లే..!! లవర్స్ తెగ పాడేసుకుంటున్న సాంగ్
Movie Song
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 7:43 PM

Share

కొన్ని సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థర స్థానం సంపాదించుకుంటాయి. చిన్న సినిమాలు గా వచ్చి సంచలన విజయాలను సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా.. పెద్ద హీరోలు, స్పెషల్ సాంగ్స్ లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగానూ దుమ్మురేపుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. ఈ సినిమాలో నటీనటులు కొత్త వల్లే.. దర్శకుడు కొత్తవాడే.. అయినా కూడా సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలోని ఓ సాంగ్ భారీ హిట్ అయ్యింది. ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది ఆ సాంగ్. సినిమాకు మించి హిట్ అయ్యింది ఆ సాంగ్. ఇంతకూ ఆ సాంగ్ ఏంటంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా మరేదో కాదు..  గత ఏడాది విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి మూవీ. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్‌ రాజ్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా నటించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు వేణు ఊడుగుల నిర్మాతగా వ్యవహరించారు. అలాగే సిద్దూ జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ విలన్ పాత్రలో అదరగొట్టాడు. వీరితో పాటు శివాజీ రాజా, అనితా చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాంబాయి నీమీద నాకు మనసాయెనే అంటూ సాగే సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పళ్లెం ఈ సాంగ్ ను ఆలపించారు. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రచించారు. ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. 25మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది రాంబాయి సాంగ్. ఇప్పటికీ ఈ సాంగ్ ను తెగ వింటున్నారు ఆడియన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?