వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్ మీద విమర్శలు
ధ్రువ సర్జా నటిస్తున్న కేడీ ది డెవిల్ సినిమా పాట తీవ్ర వివాదాస్పదమై, అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించబడింది. న్యాయవాది వినీత్ జిందాల్ హిందీ వెర్షన్ సాహిత్యం, నృత్య కదలికలపై అభ్యంతరం తెలిపారు. మైనర్లపై దీని ప్రభావం పడుతుందని కేసు వేశారు. హిందీ వెర్షన్ తొలగించినా, ఇతర భాషల సాహిత్యంపై విమర్శలు కొనసాగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో సినిమా పాటల విషయంలో వివాదాలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని పదాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వాటిని తొలగించడం జరుగుతుంది. అయితే, ధ్రువ సర్జా నటిస్తున్న కేడీ ది డెవిల్ సినిమాలోని ఓ పాటపై వివాదం మరింత తీవ్రమైంది. ఏకంగా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ పాటను తొలగించేదాకా వెళ్ళింది పరిస్థితి.కన్నడ స్టార్ అయిన ధ్రువ సర్జా, పాన్ ఇండియా రేంజ్‌లో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన గత చిత్రం మార్టిన్ ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఏప్రిల్ 30న విడుదల కానున్న కేడీ ది డెవిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఓ మాస్ పాట జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహీలపై చిత్రీకరించిన ఈ పాట హిందీ వెర్షన్ సాహిత్యంపై న్యాయవాది వినీత్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని లిరిక్స్‌తో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని, మైనర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

