AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prioce: ఉగాది రోజు రికార్డు స్థాయిలో పతనం.. రూ.7 వేలకుపైగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Gold, Silver Prices: ఉగాది పండగ రోజున మహిళలకు భారీ శుభవార్త. మహిళలు అత్యంతంగా ఇష్టపడే బంగారం ధరలు రికార్డు స్థాయిలో దిగి వచ్చాయి. వెండి కూడా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతోంది. మార్చి 19 ఉగాది పండగ రోజున తులం బంగారం పై ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో తగ్గింది..

Subhash Goud
|

Updated on: Mar 19, 2026 | 5:31 PM

Share
 Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు రోజు రోజుకు భారీగా పతనం అవుతున్నాయి. రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం  ధర రూ.2 లక్షల వరకు వెళ్లగా.. ఇప్పుడు రికార్డ్‌ స్థాయిలో తగ్గింపుతో నమోదవుతోంది. అలాగే వెండి కూడా కిలోకు ఏకంగా 4 లక్షలకు వెళ్లగా ఇప్పుడు భారీ స్థాయిలో దిగి వస్తోంది.

1 / 5
 మార్చి 19న రికార్డు స్థాయిలో ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 7,140 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై 6500 రూపాయల వరకు దిగి వచ్చింది.

2 / 5
 ధర తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,280 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,750 వద్ద కొనసాగుతోంది. ఇలా రోజురోజుకు భారీ స్థాయిలో దిగి రావడం, అది కూడా ఉగాది పండగ సమయంలో తగ్గిపోవడం మహిళలకు శుభవార్తేనని చెప్పాలి.

3 / 5
 హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,280 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,37,750 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర 2,65,000 రూపాయల వద్ద ఉంది. ఇతర ప్రాంతాల్లో మరి తక్కువగా ఉంది. కిలోకు 2,60,000 వద్ద కొనసాగుతోంది. అంటే హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో తప్ప ఇతర నగరాల్లో ఈ ధర కొనసాగుతోంది.

4 / 5
 మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ నాడు బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని భావిస్తారు. కొత్త ఏడాదిలో పసిడిని ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్మకం. దీంతో ధరలు భారీ స్థాయిలో దిగి రావడం శుభ పరిణామం.

5 / 5
Follow Us