పవన్ కళ్యాణ్ సినిమా చూడటం ఆయన అభిమానులకు ఓ పండగ. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. కానీ కామన్ ఆడియన్స్ అంత కనికరంగా ఉండరు కదా.. వాళ్లకు కచ్చితంగా స్టఫ్ ఉన్న సినిమానే కావాలి. OGలో సుజీత్ ఆ మ్యాజిక్ చేసి చూపించాడు.. ప్రతీ సీన్లో పవన్ కళ్యాణ్‌ను నెక్ట్స్ లెవల్లో ప్రజెంట్ చేసాడు. పవన్ కనిపించడం కాదు.. పేరు వినిపిస్తే ఊగిపోయారు ఫ్యాన్స్ అందులో. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాగే డిజైన్ చేయాలని చూసాడు హరీష్ శంకర్.. తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేయాలని చూసాడు.. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. చాలా సీన్స్ జస్ట్ ఫిల్ చేసినట్లు అనిపించాయి కానీ ఎమోషన్ లేదు. ఫస్టాఫ్ అయితే చాలా వరకు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్లు రాసేసాడు హరీష్ శంకర్. లిట్రల్‌గా చెప్పాలంటే పవన్ రేంజ్‌కు తగ్గట్లు ఒక్క సీన్ కూడా పడలేదు.. టైమ్ ఇచ్చాడు కదా ఏదో ఒకటి తీసేద్దాం అన్నట్లుగానే అనిపించింది. కొన్ని సీన్స్‌లో పవన్ చెప్పిన డైలాగులు పొలిటికల్‌గానూ బాగానే పేలాయి. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా చెప్పినా తగలాల్సిన వాళ్లకు తగులుతాయి. గబ్బర్ సింగ్‌లో పవన్‌లోని అణువణువు వాడేసిన హరీష్ శంకర్.. ఎందుకో మరి ఈసారి కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది