ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవుతే చాలు.. ఇంట్లో చెట్టు నిండా డ్రాగన్ ప్రూట్సే!
Samatha
19 march 2026
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేసి తింటుంటారు. ఇది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది.
ఆరోగ్యానికి మంచిది
అయితే డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడూ బయట కొనడం కంటే దీనిని మన ఇంటి బాల్కనీలో లేదా గార్డెన్‌లో సులభంగా పెంచుకోవచ్చునంట. వీటి కోసం సింపుల్ చిట్కాలు కొన్ని ఫాలో అవుతే సరిపోతుందంట.
డ్రాగన్ ప్రూట్ సాగు
కాగా, కాక్టస్ జాతికి చెందిన ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను ఇంటిలో ఎలా పెంచుకోవాలి. చెట్టు నిండా కాయలు కావాలి అంటే దీనిని పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్టో పెంచే విధానం
డ్రాగన్ ఫ్రూట్ మీరు మీ ఇంటిలో పెంచుకోవాలి అంటే, ముందుగా మీరు నాటుకొనే మొక్కను చాలా బలమైనది, మంచిగా ఉండే మొక్కను, అలాగే పెంచే కుండీ కూడా చాలా పెద్దగా రంధ్రాలుగా ఉండేది తీసుకోవాలి.
నాటుకొనే మొక్క
అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్ పెంచుకోవడానికి రాగడి మట్టి, ఇసుక 30 శాతం, 20 శాతం పశువుల ఎరువులు తీసుకోని, వీటన్నింటిని మంచిగా కలపి కుండీలో వేసి, మొక్కను నాటుకోవాలి.
మట్టి విషయంలో జాగ్రత్తలు
ఇక మొక్కను దాదాపు మూడు అంగుళాల లోతు నాటుకోవాలి. రోజూ కాకుండా రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మొక్కకు నీళ్లు పోస్తూ ఉండాలి.
నాటే విధానం
మొక్క వేపుగా పెరిగే కొద్ది దానికి ఒక ఇనుప రాడ్ జత చేయాలి. ఇక అది మంచిగా ఎదిగి పూతకు వచ్చే వరకు ప్రతి రోజూ మొక్కను చూస్తే, సమాయానికి సేంద్రియ ఎరువులు వేయాలి. అప్పుడు తెల్ల పూత వస్తుంది.
పూత
పూత వచ్చిన తర్వాత కాయలు కాయడం మొదలు అవుతుంది. కాయలు కాసిన దాదాపు 40 రోజుల తర్వాత మనం వాటిని కోసు కోవచ్చును. అయితే మనం సరైన సమయానికి ఎరువులు, నీళ్లు పోయడం వలన ఇంటిలోనే డ్రాగన్ చెట్టుకు విపరీతమైన కాయలు కాస్తాయి.