చాణక్య నీతి : మీ బాస్ లేదా సహా ఉద్యోగితో పంచుకోకూడని రెండు సీక్రెట్స్ ఇవే!

Samatha

17 march 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన అనుభవాల ద్వారా నేర్చుకున్న ఎన్నో విషయాలను నేటి తరం వారికి నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

ఆచార్య చాణక్యుడు అత్యంత తెలివైన వారిలో ఒకరు. ఈయన బోధనలు ఆ తరం వారికి మాత్రమే కాకుండా నేటి తరం వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

అపర మేధావి

ఈయన డబ్బు, బంధాలు, బంధుత్వాలు, స్నేహం, సీక్రెట్స్, ఇలా ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసిన విషయం తెలిసిందే.

బంధాలు, బంధుత్వాలు

అదే విధంగా చాణక్యుడు, ఒ వ్యక్తి కార్యాలయంలో తన బాస్ లేదా సహా ఉద్యోగితో కొన్ని విషయాలను అస్సలే పంచుకోకూడదు, ఇవి మీకే నష్టాన్ని తీసుకొస్తాయని తెలియజేశాడు. అవి ఏవి అంటే?

ఉడ్యోగి, ఆఫీసర్

చాణక్య నీతి ప్రకారం, ఒకరు తమ బలహీనతలను ఎప్పుడూ, ఎవరికీ వెల్లడించకూడదు, కార్యాలయంలో తన సహోద్యోగులతో సంబంధాలు బాగున్నా బలహీనతలు తెలపకూడదు.

బలహీనతలు

 అదే విధంగా పై అధికారికి కూడా మీ బలహీనతలు తెలియజేయకూడదు. ఒక వేళ తెలిస్తే, భవిష్యత్తులో వాటిని వారికి అనుకూలంగా వాడుకొని, మిమ్మల్ని తక్కు చేసి చూసే ఛాన్స్ ఉంది.

పై అధికారి

అదే విధంగా మీ ప్రణాళికలు అస్సలే ఇతరులతో పంచుకోకూడదు. ముఖ్యంగా మీరు వేరే జాబ్‌లోకి వెళ్లే ఆలోచన ఉన్నా, దానిని తోటి ఉద్యోగులతో పంచుకోకూడదు.

ప్రణాళికలు

మీ పై అసూయపడే వారు మీ ప్రణాళికలను పాడు చేసే ఛాన్స్ ఉంది. అందుకే మీ ప్రణాళికలను మీరు చాలా రహస్యంగా ఉంచుకోవాలి.

అసూయ ఉన్నవారు