RGUKT Basara Admissions 2026: ఆర్‌జీయూకేటీ బాసరలో ఆరేళ్ల బీటెక్ డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌జీయూకేటీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో..

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌జీయూకేటీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. బాసర ఆర్‌జీయూకేటీలో 1650, మహబూబ్‌నగర్‌లో 188 చొప్పున బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సీటు వచ్చిన విద్యార్ధులు మొదటి రెండేళ్లు ప్రీ-యూనివర్సీటీ కోర్సు (పీయూసీ), ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ కోర్సు ఉంటుంది.
స్పెషలైజేషన్ విభాగాలు
కెమికల్, సివిల్, సీఎస్‌ఈ (CSE), ట్రిపుల్‌ఈ (EEE), ఈసీఈ (ECE), మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్, మెకానికల్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ (CSE), CSE డేటా సైన్స్, CSE-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML)
పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలో అర్హత కలిగిన వారు ఎవరైనా ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్‌లో చదివిన విద్యార్థులకు అదనంగా 4 మార్కుల డిప్రైవేషన్ స్కోరు వెయిటేజీ ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు మే 5, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ, క్రీడాకారులు మాత్రం దరఖాస్తు అనంతరం దరఖాస్తు కాపీలను సర్టిఫికేట్లతో కలిపి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లిచాలి. భర్తీ కాని గ్లోబల్ సీట్లను తెలంగాణ అభ్యర్థులకు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 10, 2026.
- ప్రత్యేక కేటగిరీ దరఖాస్తులు పోస్టు ద్వారా పంపించడానికి చివరి తేదీ: మే 20, 2026.
- ఎంపికైన వారి జాబితా విడుదల: మే 30, 2026.
- మొదటి దశ కౌన్సిలింగ్: జూన్ 5, 2026.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




