టమోటో పుదీనా చట్నీ.. దోశ, ఇడ్లీల్లోకి అదిరిపోతోంది..  

Prasanna Yadla

19 March 2026

Pic credit - Pixabay

టమోటో పుదీనా చట్నీ చాలా మంది ఇష్టంగా తింటారు. ఆంధ్రాలో చాలా ఫేమస్ 

టమోటో పుదీనా చట్నీ

ఇక ఈ  చట్నీని సరైన కొలతలతో చేసి తింటే దోశ ,ఇడ్లీల్లోకి అదిరిపోతోంది.

 దోశ ,ఇడ్లీల్లోకి అదిరిపోతోంది

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎలా తయారు చేయాలంటే

 నాలుగు పండు టమోటాలు, ఒక కట్ట పుదీనా ఆకులు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర కప్పు నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

 తాలింపు కోసం అర టీ స్పూన్  మినప్పప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

ముందుగా టమోటాలను తీసుకుని పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు , 10 పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, నిమ్మరసం వేసి మిక్సీలో  మెత్తగా పట్టుకోవాలి.

స్టెప్ -1

ఆ తర్వాత దీనిని పాన్‌లో తీసుకుని 1 టీస్పూన్ నూనె వేసి అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి.ఈ పోపు మిశ్రమాన్ని తీసుకుని చట్నీ ఉన్న గిన్నెలో వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలుపుకోవాలి.

స్టెప్ -2

ఇడ్లీ, పరాటా, దోశల్లోకి ఈ టమాటా పుదీనా చట్నీ అదిరిపోతోంది. వేడిగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది.  బయట ఉంచడం కన్నా ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నుంచి నాలుగు రోజులు నిల్వ ఉంటుంది. 

నాలుగు రోజులు నిల్వ ఉంటుంది