కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
Prasanna Yadla
22 February 2026
Pic credit - Pixabay
కోడి గుడ్డుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే, వాటిలో అన్నింటికంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం సూపర్ టేస్ట్ ఉంటుంది
కోడిగుడ్డు వెల్లుల్లి కారం
కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
కోడిగుడ్డు వెల్లుల్లి కారం
4 ఉడికించిన కోడిగుడ్లు, వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, రెండు ఉల్లిపాయలుతీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా వెల్లుల్లిని కారాన్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం రోట్లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
స్టెప్ -1
ఇక ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ను తీసుకుని వాటికీ పసుపు, కారం పట్టించి నూనెలో రంగు మారే వరకు వేయించాలి.
స్టెప్ -2
మళ్ళీ అదే పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయను వేసి బాగా వేయించాలి.
స్టెప్ -3
ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం ఈ మిశ్రమంలో వేసి మీడియం మంట పై 10 నిముషాలు వేయించాలి.
స్టెప్ -4
చివర్లో కోడి గుడ్లను వేసి, మసాలా పొడులు వేసి దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తినేయండి
స్టెప్ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!