Telangana: ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. స్టూడెంట్ చేసిన పనికి అధికారులంతా షాక్
రాష్ట్రంలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇక పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హడావిడి, పోలీస్ బందోబస్తు, ఇన్విజిలేటర్లతో సందడిగా ఉంటుంది. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం పరీక్ష నిర్వాహాకులకు వింత పరిస్థితి ఎదురయ్యింది. అదేంలో తెలుసుకుందాం పదండి.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాసేందుకు కమ్మరి వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఒకే ఒక్కడూ దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల మేరకు దరఖాస్తు ఒక్కరు చేసుకున్నా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఒక చీఫ్ సూపరింటెండ్, ఒక డిపార్టమెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్ తో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తూ సైతం ఏర్పాటు చేశారు.
పరీక్ష సమయం కంటే ముందే అధికారులు విధుల్లో చేరిపోయారు. ఎగ్జామ్ సెంటర్ బయట పోలీసులు బందోబస్తులో బిజీగా ఉన్నారు. అయితే పరీక్షకు సమయం ఆసన్నమవుతున్నా విద్యార్థి మాత్రం ఇంకా పరీక్ష సెంటర్‌కు రాలేదు. పరీక్ష సమయం కూడా స్టార్ట్ అయింది, అయినా ఇంకా విద్యార్థి జాడ లేకపోవడంతో అధికారులు ఖంగుతిన్నారు. అసలు విద్యార్థి పరీక్షకు హాజరువుతాడా లేదా అన్న అనుమానం కలిగింది.
ఇక గంటల తరబడి వేచి చూసిన అధికారులకు చివరకు నిరాశే మిగిలింది. చివరకు విద్యార్థి గైర్హాజరైనట్లు అధికారులు నిర్ధారించారు. ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తే ఆ విద్యార్థి కూడా పరీక్ష రాసేందుకు రాకపోవడం కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
