మోత మోగిస్తున్న బంగారం, వెండి ధరలు.. రికార్డు స్థాయిలో పరుగులు

August 12, 2026

Subhash

ఇటీవల భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.

బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గుతుందని అనుకున్నంతనే మహిళలకు బ్యాడ్‌న్యూస్‌ అయిపోయింది. గత నాలుగైదు రోజుల నుంచి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 

రికార్డు స్థాయిలో 

ఆగస్ట్‌ 12న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1040 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్లపై 950 రూపాయలు ఎగబాకింది.

ఆగస్ట్‌ 12న

ధరలు పెరిగిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,860 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  1,41,950.

ధరలు పెరిగిన తర్వాత

ఇక వెండి విషయానికొస్తే..ఇది కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల కిలో వెండి ధర రూ.2.35 లక్షలు ఉండగా, ఇప్పుడు ఏకంగా 2.55 లక్షల రూపాయలకు చేరుకుంది.

వెండి ధర

మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం చైనా సెంట్రల్ బ్యాంకు సహా పలు వ్యవస్థాగత ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో కొంత వరకూ డిమాండ్ పెరుగుతోందని నిపుణుల చెబుతున్నారు.

 మార్కెట్‌

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో పాటు బంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

డిమాండ్

ఈ ధరలు ప్రాంతాలను బట్టి తేడా ఉండవచ్చు. అలాగే ఆయా రాష్ట్రాల జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ధరలలో మార్పులు ఉండవచ్చని గమనించండి.

ధరలు