నేను ఆ హీరోకు వీరాభిమానిని.. లారీ ఎక్కివెళ్లి సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు .

హైదరాబాద్ లోని కోకాపేటలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ వేడుకలో సీఎం రేవంత్‌పై నిర్మాత అల్లు అరవింద్ పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం లో సినిమా కు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్న.. నేను సినిమా అభిమానిని సినిమా సాంకేతికం గా వేగంగా ముందుకు వెళుతుంది. ప్రేక్షకులని కట్టిపడేసే సినిమా లు ఇప్పుడు వస్తున్నాయి అని అన్నారు.
బహుబలి,కల్కి,అరుంధతి,ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో అడ్వెంచర్స్ చేసారు. నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని..లారీ ఎక్కి వనపర్తి కి వెళ్లి నేను సినిమా లు చేసే వాడిని. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఐదారేళ్లుకు ఒక సినిమా చేస్తున్నారు..
సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమా ను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. IT,ఫార్మా తో పాటు సినిమా పరిశ్రమ గొప్ప స్థాయికి తీసుకు వెళ్తాం.. తెలుగు సినిమాకు కోలీవుడ్,శాండిల్ వుడ్,బాలివుడ్ పోటీ కాదు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలి. కృష్ణా నగర్ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేక మంది సాంకేతిక నిపుణులు,కళాకారులు వస్తున్నారు. సినిమా పరిశ్రమ పెరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మన సినిమాలు హాలీవుడ్ కి వెళ్ళాలి. సినిమాకు భాష అడ్డంకి కాదు ఇప్పుడు. టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
