AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. ఇటీవల సినిమాలతో కంటే వివాదాలతోనే రాజేంద్ర ప్రసాద్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ సినిమా అవార్డు ఫంక్షన్ లో మాట్లాడుతూ తమిళ దిగ్గజ నటుడు MGR పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో దుమారం రేగింది.

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్
Hero Vishal
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2026 | 11:06 AM

Share

ఈ మధ్య ఎక్కడ మైక్ దొరికినా కాస్త వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. తమిళ లెజెండరీ నటుడు MGR‌నే అవమానించేలా మాట్లాడిన రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. MGR‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోలీవుడ్ ఆరోపిస్తుంది. కాంతారావును పొగడడానికి MGR‌ను కించపరుస్తారా.? రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్  చేసింది.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి MGRపై నోరు జారారు రాజేంద్రప్రసాద్. కాంతారావు జాతీయ పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్‌ సన్మాన సభలో.. కాంతారావు గొప్పదనం గురించి చెబుతూ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావుగారి కత్తి సాము, ఆయన నటనను చూసి భయంతో తమిళ గ్రేటెస్ట్ హీరో MGR పోసుకునేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు నటుడు నాజర్. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హీరో విశాల్ కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

మన తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను చూసి షాక్ అయ్యాను. డియర్ సర్, అత్యంత గౌరవంతో అదే సమయంలో భారమైన హృదయంతో స్పందిస్తున్నా.. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరున్న మన దివంగత దిగ్గజ నటుడు MGR గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను . మరొక దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం ఒక అందమైన సంజ్ఞ, అదే సమయంలో మరొక దిగ్గజ నటుడు MGR గారిని కించపరచడం మన ప్రజల మనోభావాలకు మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, అతి ముఖ్యమైనదో మీకు బాగా తెలిసిన విధంగా దీన్ని ముగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా మీ స్థాయి నటుడి గురించి చెడుగా మాట్లాడితే, నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఈ సమస్యకు క్షమాపణ చెబుతున్నారని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో విశాల్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!