20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. నిజం చెప్పాలంటే హీరోయిన్స్ ను ఆయన చూపించినంతగా ఎవ్వరూ చూపించలేదనే చెప్పాలి. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు రాఘవేంద్రరావు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నేడు రాఘవేంద్ర రావు పుట్టిన రోజు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. రొమాంటికి పాటలకు ఆయన పెట్టింది పేరు. అలాగే భక్తిరస సినిమాలు తీయడంలోనూ దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు రాఘవేంద్రరావు. ఇక రాఘవేంద్ర రావు ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. నందమూరి తారకరామారావు నుంచి చిరంజీవి, నేటి జనరేషన్ లో అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసారు. అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా పరిచయం చేసాడు.
అలాగే అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా ఆయన తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తల్లి గురించి రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుటైహున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గతంలో ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. శ్రీలీల తల్లి గురించి మాట్లాడుతూ.. స్వర్ణలతను ( శ్రీలీల తల్లి) నేను ఇరవై సంవత్సరాల క్రితం చూసి ఉంటే తప్పకుండా ఆమెను హీరోయిన్‌గా చేసేవాడిని. ఆమె అందం పాత కాలం హీరోయిన్ వైజయంతీమాల గుర్తు చేస్తుంది అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ తో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. శ్రీలీల తల్లి నవ్వుతూ ఉండిపోయారు. ఈకామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




