AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్మిక ప్లేస్‌లో నేనుండాలి.. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యాను.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గత నెల ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

రష్మిక ప్లేస్‌లో నేనుండాలి.. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యాను.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్
Vijay, Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2026 | 8:34 AM

Share

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. విజయ్ రష్మిక వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో జరిగింది. వీరి వివాహానికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు.. ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు భారీ సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నపటి నుంచి అభిమానులు వీరి పై ఓ కన్నేసి ఉంచారు. ఈ ఇద్దరూ వెకేషన్స్ వెళ్లినా ఎక్కడైనా కనిపించినా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేశారు అభిమానులు.

ఇదిలా ఉంటే విజయ్ రష్మిక గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ పక్కన రష్మిక ప్లేస్ లో నేను ఉండాల్సింది.. కానీ మిస్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది ఆ ముద్దుగుమ్మ. అసలు మ్యాటర్ ఏంటంటే.. విజయ్ రష్మిక మందన్న కలిసి నటించిన గీత గోవిందం సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది రష్మికాను కాదట.. హీరో అర్జున్ కూతురు నటి ఐశ్వర్య అర్జున్ ను ముందుగా హీరోయిన్ గా అనుకున్నారట.

ఐశ్వర్య అర్జున్ సీతా పయనం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమా నేను చేయాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆతర్వాత చాలా మందిని సంప్రదించారని తెలిసింది. ఫైనల్ గా సినిమా చాలా బాగా వచ్చింది. రిలీజ్ అయినా తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నేను మిస్ చేసుకున్న సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య అర్జున్. ఇక గీతగోవిందం సినిమాతోనే విజయ్ , రష్మిక మందన్న స్నేహితులు అయ్యారు. ఆతర్వాత ఈ ఇద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ సమయానికి ప్రేమలో పడ్డారు. ఇప్పుడు భార్య భర్తలు అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us