AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్ప తాగి మహిళా కానిస్టేబుల్‌తో మనోజ్ తమాషాలు.. రోహిణిపై రగిలిపోతున్న ప్రభావతి.. సూపర్ ట్విస్టులు

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు ఆగస్ట్ 7 ఎపిసోడ్‌లో రోహిణి చెప్పిన అబద్ధాల వల్ల ప్రభావతి ఇంకా కోపంతో రగిలిపోతుంది. మీనాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు నిజం బయటకు తీయాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు బార్‌లో మందు తాగిన మనోజ్ చేసిన కామెడీ, పోలీసులతో జరిగిన సరదా సన్నివేశాలు ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రోహిణికి తన మాట చెప్పే అవకాశం ఇవ్వాలని మీనా సూచించడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.

తప్ప తాగి మహిళా కానిస్టేబుల్‌తో మనోజ్ తమాషాలు.. రోహిణిపై రగిలిపోతున్న ప్రభావతి.. సూపర్ ట్విస్టులు
Gunde Ninda Gudi Gantalu
Sharada V
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 9:36 AM

Share

Gunde Ninda Gudi Gantalu August 7 Episode: లక్షల్లో ఆస్తి వస్తుందన్న ఆశతో రోహిణిని కోడలిగా చేసుకున్న ప్రభావతి ఇంకా షాక్ లోనే ఉంటుంది. రోహిణి మలేషియా మామా చేసిన మోసం నుంచి బయటపడదు. అత్తాకోడళ్ల సంబంధాలు..సంతోషాలు..ఎత్తుకు పై ఎత్తులు.. ఇలాంటి మరెన్నో ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న “గుండెనిండా గుడిగంటలు” సీరియల్‌ ఈ రోజు ఆగస్ట్ 7వ తేదీ ఎపిసోడ్ మంచి కామెడీ టైమింగ్ తో ఈ సాయంత్రం ప్రసారం కాబోతోంది. రోహిణిని పరిచయం చేసిన మీనాక్షి దగ్గరికి వెళుతుంది. నువ్వేకదా పరిచయం చేసావు .. ఇంత అనర్థానికి నువ్వే రీజన్.. నీ పీక పిసికేస్తా అని భయపెడుతుంది. పార్లర్‌ పెడతానంటే ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి మరీ ఇస్తే.. పార్లర్‌ ఫ్రాంచైజీకి ఇచ్చేసి కాకమ్మ కబుర్లు చెప్పింది. అది విని పిచ్చిదానిలా నమ్మాను అంటుంది. నేను కేవలం పరిచయం చేసాను. నీ డబ్బు వీక్‌నెస్‌ చూసి మనోజ్‌తో వ్యాపారం అంటూ అరచేతిలో ఆకాశం చూపించింది అంటుంది కామాక్షి.

మాణిక్యాన్ని ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సింది .. ఇంత అనర్థం జరిగుండేది కాదు మీనా బాలుతో అంటుంది. పార్లరమ్మ జీవితంలో ఇంకా ఏదో జరిగింది అదేంటో కనిపెట్టాలి .. అంటాడు బాలు. పెళ్లాంని తీసుకురా రా అని ప్రభావతి చెబితే తప్ప మనోజ్ రోహిణిని తీసుకురాడు. ఆ మాట తల్లి చెప్పాలి. అప్పుడే భార్యను తీసుకొచ్చే రకం అంటాడు. కనీసం మనోజ్‌కైనా నిజం చెప్పాల్సింది. రోహిణి భర్తను మోసం చేసింది అంటాడు బాలు. మేం వెళ్లాల్సిన ట్రిప్‌ ఇంట్లో సమస్య కారణంగా క్యాన్సిల్‌ చేసుకు్న్నాం అని శ్రుతి మీనాతో అంటుంది.

Gunde Ninda Gudi Gantalu August 7 Episode

Gunde Ninda Gudi Gantalu August 7 Episode

మనోజ్‌ బార్‌లో మందు కొడుతుంటాడు. భార్య నాకు అబద్ధం చెప్పింది.. ఇదే మాట మళ్లీ మళ్లీ చెప్పి ఫ్రెండ్‌ని విసిగిస్తుంటాడు. కొందరు మనోజ్‌ని చూసి నవ్వుతారు. ఇదేం కొత్త విషయం కాదు.. మేం కూడా భార్యా బాధితులమే అంటారు. నా కేసు డిఫరెంట్ బ్రో .. వాళ్ల నాన్న తాగితే తప్పులేదు .. నేను తాగితే తప్పంట.. వాట్సాప్‌ గ్రూపును క్రియేట్‌ చేసి భార్యా బాధితుల సంఘానికి నిన్నే ప్రెసిడెంట్‌ చేస్తాం.. మనోజ్ తో అంతా అంటుంటారు. నీకు ఎక్కువైంది బ్రో .. పద ఇంటికి పోదాం .. మనోజ్‌ని స్నేహితుడు బండి మీద తీసుకెళతాడు. బ్రో నా భార్య నాకు అబద్ధం చెప్పింది .. నీకు విషయం మొదటి నుంచీ చెప్పాలి బండి ఆపు అంటూ మనోజ్‌ కామెడీ చేస్తుంటాడు. డ్రంకెన్‌ డ్రైవింగ్ లో ఆపిన పోలీసుతో మనోజ్ రచ్చ రచ్చ చేయడం హైలైట్. మహిళా కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో నువ్వేంటి ఈ డ్రెస్ లో అంటూ గోల గోల చేస్తాడు. ఎపిసోడ్ లోని ఈ భాగంలో మనోజ్ కామెడీ బాగా పండి హైలైట్ అయింది.

కామాక్షి ఇంట్లో ఉంటున్న ప్రభావతి. రోహిణి విషయం గుర్తొచ్చినప్పుడల్లా కామాక్షిని ఓ ఆట ఆడేసుకుంటుంది. ఈ విషయం మీనాతో చెప్పి కామాకి బాధపడుతుంది. కోపంలో ప్రభావతి ఎవరి మాటా వినే పరిస్థితిలో లేదు. సత్యం అన్నని ఫోన్‌ చేసి మాట్లాడమని చెప్పు అని మీనాతో అంటుంది. చెప్పి చూసాం పిన్నీ.. తను రావాలనుకున్నప్పుడు వస్తుందని మాట దాటేసారు అంటుంది మీనా. ఇద్దరూ ఇలా పట్టుపట్టి కూర్చుంటే సమస్య ఎలా తీరుతుంది అంటుంది మీనాక్షి. రోహిణి ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో ఆమెకు చెప్పే అవకాశం ఇవ్వాలి అంటుంది మీనా. ఇంతటితో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us